Share News

టీబీ బాధితులు పోషకాహారం తీసుకోవాలి

ABN , Publish Date - Jan 24 , 2026 | 12:20 AM

టీబీ పేషెంట్లు కచ్చితంగా నిత్యం పోషకా హారం తీసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు.

టీబీ బాధితులు పోషకాహారం తీసుకోవాలి

సిరిసిల్ల టౌన్‌, జనవరి 23 (ఆంధ్రజ్యోతి) : టీబీ పేషెంట్లు కచ్చితంగా నిత్యం పోషకా హారం తీసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం అంబేద్కర్‌నగర్‌ అర్బన్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ పేషెంట్లకు పోషకాహార కిట్లు, కోడి గుడ్లను ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్ర వాల్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇన్‌ చార్జి కలెక్టర్‌ మాట్లాడారు. టీబీ ముక్త్‌ భారత్‌ లో భాగంగా జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, అర్బన్‌ హెల్త్‌ సెం టర్‌, ఏరియా ఆసు పత్రులు, కమ్యూ నిటీ హెల్త్‌ సెంట ర్‌, బస్తీ దవాఖాన ల్లో ఆరోగ్య పరీక్ష లు చేసి రోగులకు మందులు కూడా ఇస్తారని అన్నారు. ప్రతినెల వెయ్యి రూపాయలు ఆర్థి క సాయం కూడా అందిస్తారని అన్నారు. టీబీ పేషెంట్లు ఖచ్చి తంగా మందులు వాడుతూ పోషకాహారం తీసుకోవాలని సూచించారు. టీబీ నియంత్ర ణకు నిక్షయ మిత్ర ఎన్‌రోల్‌మెంట్‌ డ్రైవ్‌ను నిర్వహించాలని వైద్యశాఖ అధికారులను ఇన్‌చార్జి కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లాలోని పట్టణాలు, మండలాల్లో మొత్తం 353 మం దికి పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రజిత, ఐఎంఏ అధ్యక్షురాలు శోభా రాణి, వైద్యాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jan 24 , 2026 | 12:20 AM