Share News

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:13 AM

రైతులు పండించిన మొక్కజొన్నను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్ధతు ధరను పొందాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ సూచించారు.

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి
మెట్‌పల్లిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

- మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

మెట్‌పల్లి రూరల్‌/గొల్లపల్లి/కోరుట్ల రూరల్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): రైతులు పండించిన మొక్కజొన్నను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్ధతు ధరను పొందాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ సూచించారు. మెట్‌పల్లి, గొల్లపల్లి, కోరుట్ల వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను మంత్రి లక్ష్మణ్‌కుమార్‌ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంతరెడ్డి ఆఽధ్వర్యంలో రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి క్వింటాలకు రూ. 24వందల మద్ధతు ధరను పొందాలని, కేంద్రాలకు వచ్చిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహికులు కొనుగోలను పారదర్శకంగా చేపట్టాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పిండంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌, కలెక్టర్‌ సత్యప్రసాద్‌, కాంగ్రెస్‌ పార్టీ కోరుట్ల ఇనచార్జి జువ్వాడి నర్సంగరావు, ఆర్డీవోలు నరసింహరావు, మధుసూదన, జీవకర్‌, కోరుట్ల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పన్నాల అంజిరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ తిరుమల వసంత-గంగాధర్‌, తహసీల్దార్లు నీత, మాజీద్‌, స్థానిక సర్పంచ నల్ల నీరజసతీష్‌ రెడ్డి, ఏఎంసీ చైర్మన భీమ సంతోష్‌, వైస్‌ చైర్మన పురపాటి రాజిరెడ్డి, సర్పంచల ఫోరం మండల శాఖ అధ్యక్షులు దాసరి తిరుపతి గౌడ్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ముస్కు నిశాంత రెడ్డి, సర్పంచలు అఖిలఅనిల్‌ కుమార్‌, గంగాభవానిఅరవింద్‌ గౌడ్‌, మ్యాక స్వామి, శిరీషశ్రీనివాస్‌, శ్రీలతగంగాచారి, స్రవంతిజమలాకర్‌, రాంరెడ్డి, సుమన గౌడ్‌, గంగారాం. కాసం రాజశేఖర్‌, విజయరాజేశ్వర్‌, కాంగ్రెస్‌ పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 12:13 AM