Share News

ఆత్మరక్షణకు తైక్వాండో దోహదం

ABN , Publish Date - Mar 02 , 2026 | 01:03 AM

బాలబాలికల స్వీయ ఆత్మరక్షణకు తైక్వాండో దోహదపడుతుందని జగిత్యాల మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి శ్రీనివాస్‌ అన్నారు.

ఆత్మరక్షణకు తైక్వాండో దోహదం
తైక్వాండో పోటీలను ప్రారంభిస్తున్న చైర్‌పర్సన్‌ వాణి

-మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి శ్రీనివాస్‌

జగిత్యాల అగ్రికల్చర్‌, మార్చి 2(ఆంధ్రజ్యోతి): బాలబాలికల స్వీయ ఆత్మరక్షణకు తైక్వాండో దోహదపడుతుందని జగిత్యాల మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ సమిండ్ల వాణి శ్రీనివాస్‌ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టౌన్‌హాల్‌లో జగిత్యాల జిల్లా తైక్వాండో అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన తైక్వాండో ఛాంపియన్‌షిప్‌ 2026 పోటీలను ఆదివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా వాణి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు విద్యతో పాటు ఆత్మరక్షణ విద్య అత్యంత ప్రధానమన్నారు. ఈ తైక్వాండో ద్వారా స్వీయరక్షణతో పాటు మానసిక ధృఢత్వం, శారీరక వికాసం, క్రమశిక్షణ, ఆత్మస్థైర్యం పెంపొందుతాయన్నారు. పోటీల అనంతరం గెలుపొందిన విద్యార్థులకు అతిథుల చేతులమీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఈ పోటీలకు నాలుగు జిల్లాల నుంచి సుమారు 380మంది విద్యార్థులు పాల్గొన్నట్లు జిల్లా తైక్వాండో ఛైర్మెన్‌ మంచాలకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్‌ ఛీఫ్‌ ఆర్గనైజర్‌ గందె కుమార్‌, జిల్లా అధ్యక్షుడు గంగారాం, తెలంగాణ టెక్నికల్‌ డైరెక్టర్‌ వెంకటస్వామి, నాలుగు జిల్లాల కార్యదర్శి సంతోష్‌, శ్రీనివాస్‌, సతీష్‌, రాజేంధర్‌, అఫీషియల్‌ రెఫ్రిన్‌ రాజు, నాగమణి, ధరణీధర్‌ తదితరులున్నారు.

Updated Date - Mar 02 , 2026 | 01:03 AM