అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం
ABN , Publish Date - Nov 05 , 2026 | 12:26 AM
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.
సిరిసిల్ల అర్బన్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమా వేశాన్ని నిర్వహించారు. ముందుగా ఇటీవల నియామక మైన నూతన కమిటీ సభ్యులను సన్మానించారు. జిల్లా ఇన్‌చార్జీ ఎస్సీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, ట్రైబల్ వెల్ఫేర్, మత్స్య శాఖ, పరిశ్రమల శాఖల ఆధ్వర్యంలో జిల్లాలో అమలవుతున్న పథకాలు, అభివృద్ధి పనులపై వివరించారు. ఈ సంద ర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో విచారణ వేగంగా పూర్తి చేసి చార్జిషీట్ వేస్తే బాధితులకు న్యాయంతోపాటు ప్రభుత్వ నిబంధనల మేరకు పరిహారం అందుతుందన్నారు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ శాఖల సహకారంతో జిల్లాలో అట్రాసిటీ కేసు లను త్వరగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేసేం దుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ పథకాల ప్రయోజనాలు అందిపుచ్చుకునేలా, వారి సమస్యలను జిల్లా యంత్రాంగానికి తెలియజేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ అట్రా సిటీ కేసుల కింద ఇప్పటివరకు రూ.కోటి 81,57,500 పరిహారం అందించామని వెల్లడించారు.ప్రతినెలా చివరి రోజున అన్ని మండలాల్లో ఆయా శాఖల ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాలు, ఉపకార వేతనం, విదేశీ విద్య, వివిధ ప్రభుత్వ సబ్సిడీ, ఉపాధి కల్పన పథకాలపై సభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు. స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ కొనసాగు తుందని తెలిపారు. ఎస్పీ మహేష్ బీ గితే మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో విచారణ వేగంగా పూర్తి చేస్తున్నా మని తెలిపారు. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్‌వో జయశ్రీ, ఆర్డీవో లు శ్రీధర్‌బాబు, కేఎస్‌బీ కుమా రి, డీఎస్పీ శ్రీనివాసులు, జిల్లా మత్స్య శాఖ అధికారి సౌజన్య, పరిశ్రమల శాఖ జీఎం హనుమంతు, జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మాని టరింగ్ కమిటీ సభ్యులు బి.నరేష్ నాయక్, బీపేట రాజు, భూక్య రమేష్, బడుగు లింగయ్య, జోగు రవీందర్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చింతోజు భాస్కర్, తోట లహరి, వీర రమణయ్య, వివిధ శాఖల అధికారులు తది తరులు పాల్గొన్నారు.