Share News

ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు నిఘా

ABN , Publish Date - Mar 28 , 2026 | 12:16 AM

జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్ట డంతోపాటు నిరంతరం నిఘా పెట్టి ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిం చిన వారిపై కఠిన చర్యలు తీసుకుం టామని ఎస్పీ మహేష్‌ బీగీతే అన్నా రు.

ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు నిఘా

సిరిసిల్ల అర్బన్‌, మార్చి 27 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్ట డంతోపాటు నిరంతరం నిఘా పెట్టి ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిం చిన వారిపై కఠిన చర్యలు తీసుకుం టామని ఎస్పీ మహేష్‌ బీగీతే అన్నా రు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరు లు సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగు ణంగా ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి మన ఇసుక వాహనం ద్వారా ఇసుకను సరఫరా చేయాలన్నారు. అక్రమంగా ఇసుకను రవాణా చేసిన వారిపై, నిల్వలు ఉంచిన వారిపై కేసులు నమోదు చేసి సంబంధిత వాహనాలను సీజ్‌ చేస్తామని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా గత మూడు నెలల కాలంలో ఇసుక అక్రమంగా రవాణాపై వరుసగా దాడులు నిర్వహించి 45 కేసులను నమోదు చేశామన్నారు. ఇకముందు ఇసుక రవాణాపై ఎలాంటి సడలింపులు లేకుండా కఠినంగా వ్యవహరించాలని పోలీస్‌ అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణా, అక్రమ నిల్వలపై ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ ప్రజలను కోరారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2026 | 12:17 AM