సూరమ్మ చెరువు ప్రాజెక్ట్ పనులు త్వరగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Apr 20 , 2026 | 12:29 AM
వర్షకాలం ప్రారంభంలోపే కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్ట్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆధికారు లకు, కాంట్రాక్టర్‌కు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశించారు.
రుద్రంగి, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి) : వర్షకాలం ప్రారంభంలోపే కలికోట సూరమ్మ చెరువు ప్రాజెక్ట్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆధికారు లకు, కాంట్రాక్టర్‌కు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదేశించారు. ఆదివారం ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీని వాస్ ఇరిగేషన్ అధికారు లతో కలికోట సూరమ్మ ప్రాజెక్టు పనులు పరిశీలించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల వేగాన్ని పెంచాలని అధి కారులకు, కాంట్రాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు.. వచ్చే వర్షాకాలం ప్రారంభా నికి ముందే ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తిచేయాలని అన్నారు. రాత్రి సమయంలో కూడా పనులు జరుగు తున్నాయాని అధికారులు వివరించారు. గత సమావేశం తరువాత జరిగిన పనులను అధికారులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు వివరించారు. ప్రస్తుతం కట్ట బండ్ నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలి పారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలోని మేడిపల్లి, భీమారం, కథలాపూర్ మండలాల రైతులకు సాగు, తాగునీటి అవసరాలను తీర్చే కీలక ప్రాజెక్ట్ అయిన కలికోట సూరమ్మ చెరువు అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు. పనుల అమలు పర్యవేక్షణకు తిరిగి మళ్లి 11 రోజుల తరువాత సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 43 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రాంతీయ రైతులకు భారీగా లాభం చేకూరనుంది. ఇప్పటికే ప్రాజెక్టుకు సంబంధించిన కుడి, ఎడమ కాలు వల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పూర్తయిం దని, త్వరలోనే కాలువల నిర్మాణ పనులు ప్రారంభమ వుతాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ సంతూప్రకాష్, మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, రుద్రంగి సర్పంచ్ గండి నారాయణ, ఉప సర్పంచ్ మాడిశేట్టి అభి లాష్, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, ఆకుల గగన్, తర్రె లింగం, తదితరులు పాల్గొన్నారు.