Share News

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర

ABN , Publish Date - May 01 , 2026 | 12:47 AM

ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేం ద్రాల్లోను మద్దతు ధర లభిస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాల ని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సూచించారు.

కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర

తంగళ్లపల్లి, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేం ద్రాల్లోను మద్దతు ధర లభిస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాల ని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సూచించారు. గురువారం తంగళ్లపల్లి మండ లం నేరెళ్లలో ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం ఆధ్వర్యంలో ఏ ర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. ధాన్యం కుప్పలు, వసతులు, పరిశీలించి పలు సూచనలు చేశారు. టార్పాలిన్లు, గన్ని సంచు లు, నీలి వసతి, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు ఉన్నాయా అని ఆరా తీశారు. ఈ సం దర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ధాన్యం తీసుకువచ్చే రైతులు ప్యాడీక్లీనర్లు వినియోగించాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలని, కేటాయించిన మిల్లులకు మాత్రమే ధాన్యాన్ని పం పించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి సమస్యలు తలె త్తకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అన్నారు. రాష్ట్రంలో అన్ని రేషన్‌ షాప్‌లు, ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్‌ విద్యాలయాల్లో విద్యా ర్థులకు సన్నబియ్యంతో భోజనం పెడుతున్నారని, సన్న వడ్లకు ప్రభుత్వం బోనస్‌ ఇస్తుందని తెలిపారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట వద్ద ఆయిల్‌పామ్‌ ఫ్యాక్టరీ అందుబాటులోకి వచ్చిందన్నారు. ఆయిల్‌పామ్‌ పంట దిగుబడి విక్రయానికి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. ఎన్నో లాభాలు ఉన్న సన్నరకం వడ్లు, ఆయిల్‌పామ్‌ సాగుకు రైతులు ముందుకురావాలని పిలు పునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బుచ్చి బాబు, మేనేజన్‌ నరసింహ, జిల్లా సహకార అధికారి రామకృష్ణ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆప్జల్‌ బేగం, తహసీల్దార్‌ విజయ్‌ప్రకాశ్‌రావు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2026 | 12:47 AM