Share News

విజయవంతంగా ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక అమలు

ABN , Publish Date - May 03 , 2026 | 12:04 AM

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా అమలు చేస్తున్నామని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు.

విజయవంతంగా ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక అమలు

సిరిసిల్ల, మే 2 (ఆంధ్రజ్యోతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా అమలు చేస్తున్నామని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు. శనివారం సిరిసిల్లలో ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కింద సిరిసిల్ల నియోజకవర్గ స్థాయి సభ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, ఎస్పీ మహేష్‌ బి గితే హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలం గాణ గీతం జయ జయహే తెలంగాణ వీడియోపాటను ప్రదర్శిం చారు. జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షే మ పనులపై ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను ప్రదర్శిం చారు. ఐదుగురికి నేతన్నలకు భద్రత రూ.5లక్షల చొప్పున, నేతన్న కు భరోసా కింద రూ.2 లక్షలకు పైగా విలువైన చెక్కులను పం పిణీ చేశారు. కల్యాణలక్ష్మీ చెక్కులు, ప్రభుత్వ రెసిడెన్షియల్‌ విద్యా లయాల బాధ్యులకు శానిటరీ నాప్కిన్స్‌, ఇన్సీనేటర్స్‌, దివ్యాంగులకు వీల్‌చైర్లు పంపిణీ చేశారు. మహిళా సంఘాల ఫుడ్‌ స్టాల్‌, వ్యవసాయ, ఉద్యానవన శాఖ ఆద్వర్యంలో ఆయిల్‌ పామ్‌ ఉత్పత్తులు, సన్న వరి సాగు, జిల్లా సంక్షేమ శాఖ ఆద్వర్యంలో సఖి కేంద్రం, పోషణ మాసం, బాలల భద్రత.. డ్రగ్స్‌ రహిత తెలంగాణ వారోత్సవాల స్టాళ్లను పరిశీ లించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ.. ఇప్పటిదాకా అమలు చేసిన పథకాలు, భవిష్యత్‌లో చేపట్టనున్న పనులపై ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే గ్రామ, మండల సభలు నిర్వహించామని, సర్పం చులకు శిక్షణ ఇచ్చామని వెల్లడించారు. సంక్షేమ వారాన్ని నిర్వహించా మని తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇప్పటికే పారిశుధ్య పనులు, ఆరోగ్య వారోత్సవాలు నిర్వహించామని, అరైవ్‌.. అలైవ్‌ కార్యక్రమాలు, రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించేలా అవగాహన కల్పించామని, డ్రైవర్లకు కంటి పరీక్షలు, సీపీ ఆర్‌, ప్రాథమిక చికిత్సపై అవగాహన, శిక్షణ ఇప్పించామని తెలిపారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు, వసతి గృహాలలో వంటగది, పారిశుధ్యం, మరమ్మతు పనులు చేపట్టామని, విద్యార్థులకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించాలని, స్కిల్‌ డెవలఫ్‌మెంట్‌, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహించా మని తెలిపారు. టీబీ ముక్త్‌ భారత్‌ కింద జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో పరీక్షలు చేయిస్తున్నామని వివరించారు. ఇందిరమ్మ ఇండ్లకు ప్రొసీడిం గ్స్‌, అంగన్‌వాడీ కేంద్రాలకు ఆక్వాగార్డ్‌ నీటి శుద్ధి యంత్రాలు, ప్రభుత్వ రెసిడెన్షియల్‌ విద్యాలయాలు, స్కూల్‌ విద్యార్థులకు ఇన్సీనేటర్స్‌ పంపిణీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ పరిధిలోని మోడల్‌ హౌస్‌ ను సందర్శించాలని, ప్రభుత్వ ఆర్థిక సహాయంలోనే ఇళ్లు నిర్మించుకోవా లని సూచించారు. 1968 ఇందిరమ్మ ఇళ్లు పూర్తి అయి.. రాష్ట్రంలో జిల్లా మొదటిస్థానంలో ఉందని తెలిపారు. మహిళా సంఘాలలోని సభ్యుల కు ఇంటి నిర్మాణానికి రుణం ఇప్పిస్తామని వెల్లడించారు. రైతులు సన్న రకం వడ్లు, ఆయిల్‌ పామ్‌ సాగు చేయాలని

Updated Date - May 03 , 2026 | 12:04 AM