యువత ప్రణాళికతో చదివితే విజయం
ABN , Publish Date - Sep 13 , 2026 | 01:03 AM
యువత ప్రణాళికతో చదివి విజయం సాధించాలని ఎస్పీ మహేష్ బీగీతే కోరారు.
సిరిసిల్ల అర్బన్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : యువత ప్రణాళికతో చదివి విజయం సాధించాలని ఎస్పీ మహేష్ బీగీతే కోరారు. జిల్లాలో ఎస్‌ఐ, కానిస్టేబు ల్ తోపాటు వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు సరైన మార్గదర్శకాలను అందించేందుకు శనివారం సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్ట ణంలోని లహరీ ఫంక్షన్ హాల్‌లో అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎస్పీ మహేష్ బీగీతే ప్రారంభించారు. ఈ అవగాహన సదస్సులో పోటీ పరీక్షలకు అవసరమైన సబ్జెక్టుల వారిగా పరీక్షల విధా నం, సమయపాలన, ప్రిపరేషన్ ప్రణాళిక, పరీక్షల్లో విజ యానికి అనుసరించాల్సిన వ్యూహ్యాలు, ఫిజికల్ టెస్ట్, గ్రౌండ్‌ఈవెంట్స్‌లకు సంబంధించిన వాటిపై నిపుణులతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లా డుతూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ముందుగా ఏయే సబ్జెక్టుల్లో బలహీనంగా ఉన్నారో గుర్తించి, ప్రణాళిక ప్రకారం ఆయా సబ్జెక్టులపై ఎక్కువ దృష్టి సారించి సబ్జెక్టులపై పట్టు సాధించాలన్నారు. చదువుతున్న సమయంలో ఏవైనా సందేహాలు ఉంటే వాటిని తమలోనే ఉంచుకోకుండా నిపుణులను సంప్ర దించి నివృత్తి చేసుకోవాలన్నారు. ప్రతి సబ్జెక్టుకు నిర్దిష్ట వెయిటేజీ ఉంటుందని, దానికి అనుగుణంగా ప్రిపరేషన్ కొనసాగిస్తే పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చ న్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో అభ్యర్థులు ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వా సంతో ముందుకు సాగాలని సూచించారు. పరీ క్షల సమయంలో ఆందోళన, భయాన్ని పక్కన పెట్టి ప్రశాంతంగా ప్రిపరేషన్ కొనసాగిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. అభ్యర్థు లు ప్రతిరోజూ ఒక ప్రణాళికను రూపొందించు కుని, దాని ప్రకారం చదువును కొనసాగించాల న్నారు. సమయపాలన, క్రమశిక్షణ, నిరంతర సాధనతో లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సును ఏర్పాటు చేశామని, అభ్యర్థులు నైపుణ్యాలను మెరుగుపరుచుకుని, మెరుగైన ఫలితాలు సాధించేందుకు సదస్సు ఉపయోగపడుతుందన్నారు. డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, స్కిల్ గురు డాక్టర్ విజయరఘురామరాజు, ఆల్ ఇండి యా పోలీస్ ట్రైనర్ సీడీటీ లైఫ్‌కోచ్, పర్సనాలీటీ డెవ లప్‌మెంట్ ట్రైనర్ మహేష్‌కుమార్, నవీన్‌సందర్, అమ రేష్, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.