ఆంగ్లంలో తడబాటు..
ABN , Publish Date - May 02 , 2026 | 01:17 AM
పదో తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తేనే ఉన్నత విద్యలోకి ప్రవేశం ఉంటుంది..అయితే పదో తరగతిలో పలువురు విద్యార్థులు తడబడుతున్నారు. ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో జగిత్యాల జిల్లా 98.87 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో 4వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 143 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు.
- గణితంలో గ్రహపాటు
- పదో తరగతి పరీక్షల్లో 143 మంది ఫెయిల్
- అధికంగా ఇంగ్లీష్, మాథ్స్ సబ్జెక్టుల్లోనే..
- తెలుగు, హిందీ మాతృభాషాల్లోనూ అంతంతే పట్టు
జగిత్యాల, మే 1 (ఆంధ్రజ్యోతి): పదో తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తేనే ఉన్నత విద్యలోకి ప్రవేశం ఉంటుంది..అయితే పదో తరగతిలో పలువురు విద్యార్థులు తడబడుతున్నారు. ఇటీవల వెలువడిన పదో తరగతి ఫలితాల్లో జగిత్యాల జిల్లా 98.87 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో 4వ స్థానంలో నిలిచింది. జిల్లాలో 143 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. పాఠ్యాంశాల వారీగా పరిశీలిస్తే ఇంగ్లీష్, గణితంలలో అధికంగా ఫెయిల్ అయ్యారు. తెలుగు, హిందీ మాతృభాషాల్లోనూ అంతంతే పట్టు సాధించారు.
చదవలేక...రాయరాక..!
ఇంగ్లీష్ స్పష్టంగా చదవడం, రాయడం రాకపోవడంతోనే సంబంధిత సబ్జెక్టులో విద్యార్థులు ఫెయిల్ అయినట్లు తల్లిదండ్రులు అంటున్నారు. ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాలను విశ్లేశిస్తే ఇతర సబ్జెకులతో పోలీస్లే ఇంగ్లీష్‌లోనే ఎక్కువ మంది ఫెయిలయ్యారు. జిల్లాలో పదో తరగతి పరీక్షలకు 12,687 మంది హాజరుకాగా ఇంగ్లీష్ సబ్జెక్టులో 12,610 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఇతర సబ్జెక్టులకంటే ఇంగ్లీష్‌లో అత్యధికంగా 77 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఇతర సబ్జెక్టులపై ఉన్న పట్టు ఇంగ్లీష్‌పై ఉండడం లేదు. ఇంగ్లీష్‌లో తప్పిన వారిలో మెజార్టీ గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులున్నట్లు అంచనా ఉంది. ఎక్కువ మంది విద్యార్థులు ఇంగ్లీష్‌లో సబ్జెక్టులో ఫెయిల్ కావడం ఆందోళనకరంగా మారింది. కఠినమైన గణితం, సైన్సలో కాకుండా భాషా సబ్జెక్టుల్లో తప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది.
లెక్కలతో తప్పని చిక్కులు..
గణింతం పాఠ్యాంశాల్లో సమస్యలను అన్వయించి పరిష్కరించడంలో విద్యార్థులు రాణించలేకపోతున్నారు. జిల్లాలో పదోతరగతి పరీక్ష ఫలితాల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఇంగ్లీష్ తర్వాత మ్యాథ్స్ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు. జిల్లాలో 12,687 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 12,634 మంది విద్యార్థులు మ్యాథ్స్ పాస్ అయ్యారు. 53 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. జిల్లాలో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు లేదా ఉర్దూలో 26 మంది విద్యార్థులు ఫెయిల్ కాగా సెకండ్ లాంగ్వేజ్ హిందీ లేదా తెలుగులో తొమ్మిది మంది విద్యార్థులు, సైన్స సబ్జెక్టులో 44 మంది విద్యార్థులు, సోషల్ స్టడీస్‌లో 11 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారు.
రాష్ట్ర స్థాయిలో నాలుగో స్థానం..
జిల్లా విద్యాశాఖ పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను పకడ్బందీగా సిద్ధం చేసింది. గత యేడాది రాష్ట్రస్థాయిలో పదోతరగతి ఫలితాల్లో నాలుగో స్థానాన్ని సాధించగా, 2025-26 విద్యా సంవత్సరంలో వంద శాతం ఫలితాలు సాధించే దిశగా విద్యాశాఖ కట్టుదిట్టంగా ప్రణాళికను అమలు చేసింది. ఇందుకు అనుగుణంగా ఫలితాలను రాబట్టేందుకు జిల్లా విద్యాశాఖాధికారి రాము పాఠశాలలను నిరంతరం పర్యవేక్షించారు. వారంలో ఒక రోజు హెచఎంలు, ఎంఈవోలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ యాక్షన ప్లాన అమలు చేశారు. డిసెంబరులోగా సిలబస్ పూర్తి చేయించారు. దీంతో ముందుగానే రివిజన మొదలు పెట్టేందుకు అవకాశం కలిగింది. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ.. రోజువారీగా సైక్లింగ్ టెస్టులు ఏర్పాటు చేశారు. విద్యార్థుల హాజరు, సబ్జెక్టుల వారీగా రిపోర్టులను ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తూ వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించారు. పలు పాఠశాలల్లో దాతల సహాయంతో, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు ఉదయం, సాయంత్రం స్నాక్స్ అందించారు. సబ్జెక్టుల వారీగా ప్రత్యేక మాడ్యూల్ చేయించి విద్యార్థులకు అందించారు. దీంతో జగిత్యాల జిల్లా ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ తిరిగి నాలుగో స్థానాన్ని పదిలపరచుకుంది.
సబ్జెక్టుల వారీగా ఉత్తీర్ణత..
సబ్జెక్టు - పరీక్షకు హాజరు - పాస్ - ఫెయిల్
తెలుగు - 12,687 - 12,661 - 26
హిందీ - 12,687 - 12,678 - 9
ఇంగ్లీష్ - 12,687 - 12,610 - 77
మ్యాథ్స్ - 12,687 - 12,634 - 53
సైన్స - 12,687 - 12,643 - 44
సోషల్ - 12,687 - 12,676 - 11