పక్కా ప్రణాళికతో చదివి పరీక్షల్లో రాణించాలి
ABN , Publish Date - Jan 24 , 2026 | 12:37 AM
పదో తర గతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు పక్కా ప్రణాళికతో చదవి ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు.
- కలెక్టర్ సత్యప్రసాద్
కథలాపూర్, జనవరి 23 (ఆంధ్రజ్యోతి): పదో తర గతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు పక్కా ప్రణాళికతో చదవి ఉత్తీర్ణత సాధించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. మండలంలోని గంభీర్‌పూర్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన సందర్భంలో విద్యార్థులతో తరగతి గదిలో మాట్లాడారు. విద్యార్థులతో పాఠాలు చదవించి వారి బోధనాభ్యసన స్థితిగతులను పరిశీలించారు. పదోతర గతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఆయా సబ్జెక్టులపై పూర్తిగా అవగాహన ఉండేలా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. మధ్యా హ్న భోజనం అమలు తీరును పరిశీలించి నాణ్యమై న భోజనంతో పాటు పరిశుభ్రత పాటించాలని నిర్వా హకులకు సూచించారు. గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఆటల పోటీల్లో భాగంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్ షటిల్ ఆడారు. కోరుట్ల ఆర్డీవో జివాకర్‌రెడ్డి, తహసీల్దార్ వెన్న వినో ద్, సర్పంచ్ గుంటుక మనోహర్ ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్లను వేగవంతం చేయాలి
జగిత్యాల (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మా ణం మరింత వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్ర సాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఇం దిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడారు. జిల్లాలో 11,079 ఇళ్లు పెం డింగ్‌లో ఉన్నాయని, మార్చి 31వ తేదీ నాటికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముగ్గు పోసి పనులు ప్రారంభించాలని తెలిపారు. ఎంపీడీవోలు, సంబంధి త అధికారులతో సమన్వయంతో పనిచేసి ఇందిర మ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలని ఆదే శించారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, జగిత్యాల ఆర్డీవో మధు సూదన, హౌసింగ్ పీడీ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.