Share News

కష్టపడి చదవండి..

ABN , Publish Date - Sep 02 , 2026 | 12:32 AM

విద్యార్థులు కష్టపడి చదివి తమ కలలను సాకారం చేసుకోవాలని కలెక్టర్‌ చిత్ర మిశ్రా సూచించారు.

కష్టపడి చదవండి..
గురుకుల డిగ్రీ కళాశాల హాస్టల్‌లో వంటకాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ చిత్రా మిశ్రా

కరీంనగర్‌ రూరల్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు కష్టపడి చదివి తమ కలలను సాకారం చేసుకోవాలని కలెక్టర్‌ చిత్ర మిశ్రా సూచించారు. మండలంలోని నగునూర్‌ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను మంగళవారం కలెక్టర్‌ చిత్రా మిశ్రా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాలను పరిశీలించారు. విద్యార్థుల కోసం తయారు చేస్తున్న వంటకాలను, అన్నం నాణ్యతను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టేలా ఎదగాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ టి మాలతి పాల్గొన్నారు.

ఫ వృద్ధులు, దివ్యాంగుల వసతి గృహంలో మెరుగైన సౌకర్యాలు

కరీంనగర్‌ టౌన్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వృద్ధుల, దివ్యాంగుల వసతి గృహంలో మెరుగైన సౌకర్యాలను కల్పించాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ కార్ఖానగడ్డలోని ప్రభుత్వ వృద్ధుల, దివ్యాంగుల వసతి గృహాన్ని సందర్శించారు. వసతిగృహంలో జరుగుతున్న ఆధునీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వసతిగృహాన్ని ఆధునీకరించి సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి, వార్డెన్‌ రాధిక, స్వప్న పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2026 | 12:32 AM