శ్రద్ధగా చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలి
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:14 AM
విద్యార్థులు నిత్యం శ్రద్ధగా చదివి ఉన్నత స్థానాల్లో స్ధిరపడాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు.
తంగళ్లపల్లి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు నిత్యం శ్రద్ధగా చదివి ఉన్నత స్థానాల్లో స్ధిరపడాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. శుక్రవారం తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ శివా రులో గిరిజన సంక్షేమ పాఠశాల, కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల, సిబ్బంది హాజరు రిజిస్టర్లు, కిచెన్, స్టోర్ రూంలను పరిశీలించారు. స్టోర్ రూమ్‌లో సరుకుల నాణ్యత తనిఖీ చేశారు. మోనూ చార్ట్ ప్రకారం ఆహర పదార్థాలు ఉన్నాయా అని పరిశీలించారు. హాస్టల్ ఆవరణలో పలు అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. పదో తరగతి విద్యార్థు లను పరీక్షల మధ్య విరామ సమయం సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. శ్రద్ధగా అన్ని పాఠ్యాంశాలు మరోసారి చదవాలని, సమా ధానాలు రాయాలని సూచించారు. గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో పలు ప్రశ్నలు వేసి సమధానాలు రాబట్టారు.