Share News

విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికావొద్దు

ABN , Publish Date - Mar 13 , 2026 | 12:52 AM

విద్యార్థులు మానసిక ఒత్తి డికి గురికావొద్దని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళచక్రపాణి అన్నారు.

విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురికావొద్దు

సిరిసిల్ల టౌన్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులు మానసిక ఒత్తి డికి గురికావొద్దని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళచక్రపాణి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో నెహ్రూనగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశా లలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలుకుతూ తొమ్మిదవ తరగతి విద్యార్థులు వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథి మున్సి పల్‌ చైర్‌పర్సన్‌ కళాచక్రపాణి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృ తిక కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ కళచక్ర పాణి మాట్లాడారు. ఈనెల 14న ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్ష లకు హాజరవువుతున్న విద్యార్థులు మానసిక ఒత్తిడిలకు గురికావద్ద న్నారు. ఇష్టంగా కష్టపడి చదివిన విద్యార్థులు రాష్ట్ర, జిల్లా స్థాయిలో అత్య ధిక మార్కులు సాధించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. అనంతరం విద్యా ర్థులు ఆటపాటలతో ఆహుతులను అలరించారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్‌ ఎర్ర వెంకట్రాజం, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ ఉపాధ్యక్షుడు బొప్ప దేవయ్య, అమ్మ ఆదర్శ కమిటి చైర్మన్‌ గంగుల రుక్మిణి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నాగుల భాగ్యరేఖ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2026 | 12:52 AM