Share News

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:23 AM

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఎంచుకొనొ, నిరంతరం శ్రమించాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ సూచించారు. శుక్రవారం జగిత్యాల పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను సందర్శించారు.

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి
జగిత్యాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న కలెక్టర్‌ సత్యప్రసాద్‌

- కలెక్టర్‌ సత్యప్రసాద్‌

జగిత్యాల, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఎంచుకొనొ, నిరంతరం శ్రమించాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ సూచించారు. శుక్రవారం జగిత్యాల పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం భోజనంలో విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. వంటగది పరిశుభ్రత, ఆహార నాణ్యత, నిల్వ విధానాలు తదితర అంశాలను పరిశీలించారు. స్టోర్‌ రూమ్‌లో ఉన్న బియ్యం, పప్పులు, కూరగాయలు, ఇతర సరుకుల సామగ్రిని తనిఖీ చేశారు. అనంతరం పదో తరగతి విద్యార్థుల మెరుగైన ఫలితాల కోసం తీసుకుంటున్న ప్రణాళికలపై పాఠశాల స్పెషల్‌ ఆఫీసర్లు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచేందుకు ప్రత్యేక తరగతులు, రివిజన ప్లాన, మోడల్‌ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. మెస్‌ కమిటీ వ్యవహారాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో నేరుగా ముచ్చటించి పాఠశాలలో కల్పిస్తున్న అన్ని వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పాఠ్యంశాల్లోని పలు ప్రశ్నలు అడిగి వారి చదువు, లక్ష్యాలు, ఆశయాల గురించి తెలుసుకున్నారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు. పీఎం పోషణ్‌ పథకం లక్ష్యాలకు అనుగుణంగా నాణ్యమైన ఆహారం అందించాలని ఆదేశించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వారికి అందుతున్న ఆహారం, వసతి సదుపాయాలపై నేరుగా అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కె రాము, తహసీల్దార్‌ రామ్మోహన, కేజీబీవీ ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

కస్తూర్బా, గిరిజన ఆశ్రమ పాఠశాలల తనిఖీ

బీర్‌పూర్‌: మండలంలోని తుంగూర్‌ కస్తూర్బా బాలికల పాఠశాల, మంగేళ(గోండుగూడెం) గ్రామంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలను అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత శుక్రవారం తనిఖీ చేశారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను సందర్శించి ఇంటర్‌ పరీక్షల నిర్వహణను పరిశీలించారు. గిరిజన ఆశ్రమ పాఠశాలలో పరిసరాలను, వంటగదిని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠాలు భోదించి సమాదానాలు రాబట్టారు. కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించి వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం బీర్‌పూర్‌ శివారులోని అన్నారంలో భూసర్వేపై రైతులతో సమావేశమై సర్వేకు సంబంధించిన వివరాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సుజాత, ఆర్‌ఐ రాహుల్‌, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2026 | 12:23 AM