విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలి
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:24 AM
విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చి దిద్దాలని, సామాజిక విలువలు క్రమశిక్షణ అలవడే విధంగా బోధించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
సిరిసిల్ల, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చి దిద్దాలని, సామాజిక విలువలు క్రమశిక్షణ అలవడే విధంగా బోధించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని 37 మంది ఉత్తమ ఉపాధ్యాయుల ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమ అగ్రవాల్‌లు అవార్డులతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయులను సన్మా నించడంతో మిగతా వారికి మార్గదర్శకంగా ఉంటుందని తెలిపారు. తల్లిదం డ్రుల తరువాత విద్యార్థులపై ప్రభావం చూపేది ఉపాద్యాయులేనని స్పష్టం చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, అబ్దుల్ కలాం, మహాత్మా జ్యోతి రావుపూలే దంపతుల బోధనలు స్పూర్తిగా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠ శాలల్లో చదువుతున్న వారికి మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. టీచర్లు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రతి విద్యార్థి మనోవికాసం, సమాజ విలువలు, కట్టుబాట్లు, క్రమశిక్షణ అంశాలపై బోధించాలని సూచిం చారు. విద్యార్థుల్లో పోటీతత్వం పెంచాలని, అన్ని రంగాల్లో తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. డైట్‌చార్జీలు, కాస్మొటిక్ చార్జీలు పెంచామని తెలిపారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. ఉదయం పూట టిఫిన్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభు త్వం, సీఎం రేవంత్‌రెడ్డి విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. ఇప్ప టికే 11 వేల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశారని వెల్లడించారు. ప్రభుత్వ పాఠ శాలల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు అన్ని చర్య లు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభించిందని తెలిపారు. జిల్లాలో రెండు స్కూళ్లు రానున్నాయని వెల్ల డించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్ నిర్మాణ పనులు ప్రారంభించామని వివరించారు. విద్యలో విప్లవాత్మకమైన మార్పు లకు శ్రీకారం చుట్టిందని గుర్తు చేశారు. ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని పేర్కొన్నారు.
విద్యార్థులకు రోల్ మోడల్ టీచర్లు..
విద్యార్థులకు టీచర్లు రోల్ మోడల్ ఉంటారని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు. తాను టీచర్స్‌డే రోజు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తాను ఆరో తరగతిలో పద్యం, స్పీచ్ ఇవ్వడం మరిచిపోలేని అనుభూతిగా గుర్తు చేశారు. అప్పటి తమ మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని ఖర్గోన్ కలెక్టర్‌ను కలిసి ఆమె మాటలతో స్పూర్తి పొందానని వివరించారు. ప్రతి ఏడాది జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం రోజున అదే విషయం గుర్తుకు వస్తుందని తెలి పారు. ఎన్నికల సమయంలో జిల్లాలో ఉపాధ్యాయులు ఎంతో చక్కగా విధు లు నిర్వర్తించి ప్రక్రియ సాఫీగా సాగేలా సహకారం అందించారని కొనియా డారు. పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ), విద్యాలయాల్లో విద్యార్థుల నమోదులో మెరుగైన సేవలు అందించారని గుర్తు చేశారు. జిల్లాలో పెర్ఫా ర్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ) ప్రక్రియను ఖమ్మం జిల్లా నుంచి టీచర్స్ వచ్చి చూశారని తెలిపారు. ప్రతి విద్యార్థిని తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు కీలకమని స్పష్టం చేశారు. విద్యార్థి ఇష్టపడే టీచర్ బోధించే సబ్జెక్ట్‌ను ఇష్ట పడతారని వివరించారు. టీచర్ రోల్ మోడల్‌గా తీసుకుంటారని తెలిపారు. ప్రతి టీచర్ ప్రవర్తన కీలకమని పేర్కొన్నారు. విద్యార్థులను ఉత్తములగా తీర్చిదిద్దడంలో టీచర్లు కీలకమని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఎందరో ఉన్నత స్థానాలకు ఎదిగారని వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల మున్సిప ల్ చైర్‌పర్సన్ జిందం కళ, జిల్లా విద్యాధికారి మొండయ్య, కోనరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..
జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులు పొందిన హెచ్‌ఎంలు, పీడీ, పీఈటీలు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలు, కేజీబీవీ ఎస్‌ఓ, సీఆర్టీ, పీజీ సీఆర్టీలు, ఐఈ ఆర్పీల్లో చిట్నేని శ్రీకాంత్ రావు, టీ మనోహరాచారి, ఆడెపు రాజేశం, అజ్మీరా మదన్ లాల్, గుర్రం సందీప్, నర్ర శ్రీనివాసరెడ్డి, టీ మధుకర్ రెడ్డి, గంప లక్ష్మీనారాయణ, ఎం లక్ష్మయ్య, మోహమ్మద్ రహీం, సీహెచ్ రమాదేవి, ఎం కోటేశ్వర్, కొప్పు రాములు, వెంగల మహేష్, మా దాడి వెంకటరావు, కుమ్మరి మల్లేశం, సీహెచ్ మాధవి లత, ఎన్ కనకయ్య, ఈ శ్రీనివాస్, కపిల్ల నరేష్, రామగిరి స్వరాజ్యలక్ష్మి, కొత్తపల్లి మమత, యాస శ్రీలత, డీ రఘు, ఎం సుజాత, బోనగిరి రాజేందర్, ఊతం విజయ కుమార్, దరిపెల్లి రాజేశం, బొల్లి రమేష్, అణువోజు రాజు, తెల్ల వకుల, మేకల పద్మ, మామిళ్ల విఠల్, కే జయలక్ష్మి, ఆర్ వసంత, బి సుధారాణి, టి గీత అవార్డులు పొందారు.