విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు మెరుగుపర్చాలి
ABN , Publish Date - Jul 23 , 2026 | 11:55 PM
జిల్లాలోని ప్రభుత్వ విద్యాల యాల్లో విద్యార్థులకు అభ్యాసన సామర్థ్యాలను మరింత మెరుగుపర్చాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
సిరిసిల్ల అర్బన్, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ప్రభుత్వ విద్యాల యాల్లో విద్యార్థులకు అభ్యాసన సామర్థ్యాలను మరింత మెరుగుపర్చాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్(పీజీఐ)పై జిల్లా విద్యాశాఖ అధికారి మొండయ్య, కోఆర్డి నేటర్లు, ఎంఈవోలు, హెచ్‌ఎంలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు మరింత మెరుగుపడేలా ఒక ప్రణాళికను రూపొందించాలని, దానికి అను గుణంగా ముందుకువెళ్లాలని ఆదేశించారు. ఇంగ్లీష్, గణితం,సైన్స్ తదితర పాఠ్యాంశాల్లో ప్రతిభచూపేలా విద్యార్థులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పేలా తీర్చిదిద్దాలని సూచించారు. జిల్లా విద్యాధికారి తమ పరిధిలోని మండల విద్యాధికారులు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలతో సమీక్షా సమావేశాలను నిర్వహించాలని ఆదేశించారు. మండల విద్యాధికారులు కాంప్లెక్స్ హెచ్ ఎంలు షెడ్యూల్ ప్రకారం తమ పరిధిలోని అన్ని విద్యాలయాల్లో తనిఖీలు చేసి వివరాలను నమోదు చేయాలని తెలిపారు. టీచర్ల ట్రైనింగ్ వివరాలు అన్ని విద్యాలయాల్లో కంప్యూటర్‌లు, ట్యాబ్‌లు, ఇంటర్నెట్ కనెక్షన్, ఐఎఫ్‌బీ ప్యానెల్స్, టాయిలెట్స్ తరగతి గదులు, మైదానం, ఇతర మౌలిక సదుపా యాల పూర్తి సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. అన్ని విభాగాల్లో ఉత్తమ పనితీరు చూపాలని, విద్యారంగంలో జిల్లాలో మెరుగైన స్థానంలో ఉండేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లా విద్యా ధికారి మొండయ్య, జిల్లా కో-అర్డినేటర్ తది తరులు పాల్గొన్నారు.