Share News

బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలకు విద్యార్థుల ఎంపిక

ABN , Publish Date - May 13 , 2026 | 12:34 AM

బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల్లో 2026- 27 విద్యాసంవత్సరానికి విద్యార్థుల ఎంపిక కోసం డ్రా పద్ధతిన కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఎంపిక చేశారు.

బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలకు విద్యార్థుల ఎంపిక

సిరిసిల్ల అర్బన్‌, మే 12 (ఆంధ్రజ్యోతి) : బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలల్లో 2026- 27 విద్యాసంవత్సరానికి విద్యార్థుల ఎంపిక కోసం డ్రా పద్ధతిన కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఎంపిక చేశారు. కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ ఛాంబర్‌లో మంగళవారం బెస్ట్‌ అవైలబుల్‌ పాఠశాలలో 3,5,8వ తరగతుల్లో విద్యార్థులను చేర్పించేందుకు ఆన్‌ లైన్‌లో దరఖాస్తులు చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో కలెక్టర్‌ గరి మ అగ్రవాల్‌ డ్రా తీసి విద్యార్థులను ఎంపిక చేశారు. డ్రాలో 3వ తరగతిలో ముగ్గురు బాలురు, ఒక బాలిక, ఐదో తరగతిలో బాలుడు, బాలియక 8వ తర గతిలో బాలుడిని ఎంపిక చేశామని కలెక్టర్‌ తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు త్వరలో కౌన్సెలింగ్‌ నిర్వహించి ధ్రువప్రతాలను పరిశీలించిన అనంతరం ప్రవేశా లు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి జగన్‌మో హన్‌రెడ్డి, గిరిజన అభివృద్ధి అధికారి సంగీత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2026 | 12:34 AM