Share News

ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా

ABN , Publish Date - Jul 23 , 2026 | 11:59 PM

పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శు లు కుర్ర రాకేష్‌, మంద అనిల్‌కుమార్‌లు డిమాండ్‌ చేశారు.

ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా

సిరిసిల్ల అర్బన్‌, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శు లు కుర్ర రాకేష్‌, మంద అనిల్‌కుమార్‌లు డిమాండ్‌ చేశారు. ఏఐఎస్‌ ఎఫ్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నాయకులు సిరిసిల్ల కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేశారు. కలెక్టరేట్‌ ఏవో రాంరెడ్డి కి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, అలాగే రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు నెలల తరబడి విడుదల చేయకపోవడంతో పేద, మధ్య తరగతి కు టుంబాల విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించలేని పరిస్థితి నెల కొందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్‌లో ఉన్న అన్ని స్కాల ర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకవచ్చి జీవోలు 7,8,9 కారణం గా పేద, మధ్యతరగతి బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు స్కాలర్‌ షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఫెలోషిప్‌లకు దూరమవుతున్నారని అన్నారు. ఈ జీవోలను వెంటనే రద్దు చేసి గతంలో అమలులో ఉన్న విధానంలోనే ప్రతి అర్హతగల విద్యార్థికి ఎలాంటి ఆంక్షాలు లేకుండా స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌లను అందించాలన్నారు. ప్రభు త్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలు, డీగ్రీ కళాశాలలు అనేక చోట్ల శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. పైకప్పులు ఊడిపోవడం, గోడలు పగిలిపోవడంతో వర్షం వస్తే తరగతి గదుల్లోకి నీరు వచ్చే పరిస్థితి ఉందన్నారు. తాగునీరు, మరుగుదొడ్లు, పర్నీచర్‌, విద్యుత్‌, ప్రయోగశాల లు, గ్రంథాలయాలు వంటి కనీస సౌకర్యాలు కూడా లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. జిల్లాలోని అన్ని ప్రభు త్వ విద్యాసంస్థలు అత్యవసరంగా మరమ్మతు చేసి అవసరమైన కొత్త భవనాలు నిర్మించి, మౌలిక సదుపాలయాలను కల్పించి, ఉపాధ్యాయు లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బందిని భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గర్ల్స్‌ కన్వీనర్‌ బర్రెంకల శ్రీహారిక, ఉపాఽధ్యక్షురాలు బోధసి ప్రవళిక, నాయకులు అంజనేయులు, వైభవ్‌, మనీ్‌ష్‌, గౌతమి, మౌనిక, ముదసర్‌షరీఫ్‌, రేహాన్‌, అయన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2026 | 11:59 PM