Share News

పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి

ABN , Publish Date - Feb 06 , 2026 | 12:57 AM

పుష్కర ఏర్పాట్లకు పక్కాప్రణాళిక రూపొందిం చాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అన్నారు.

పుష్కరాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి

పెద్దపల్లి కల్చరల్‌, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): పుష్కర ఏర్పాట్లకు పక్కాప్రణాళిక రూపొందిం చాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అన్నారు. గురు వారం కలెక్టరేట్‌లో గోదావరి పుష్కరాల ఏర్పా ట్లపై అదనపుకలెక్టర్‌ వేణుతోకలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గోదావరి పుష్కరాల సమయంలో మంథనిలో పుష్కరస్నానం చేసిన భక్తులు మిగి లిన దేవాలయాలను దర్శించుకునేలా ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. గత పుష్క రాల సమయంలో ఎదురైన అనుభవాలను దృష్టి లో ఉంచుకొని, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల న్నారు. సమావేశంలో ఆర్డీవోలు గంగయ్య, సురే ష్‌, దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ సుప్రి య, ఈవైటీం తహరింఖాన్‌, జైదీప్‌, మిషన్‌ భగీరథ ఈఈ శ్రీనివాస్‌, అధికారులు పాల్గొన్నారు.

మంథని/రామగిరి: రామగిరిమండలం సుందిళ్ల లోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం, మంథనిలోని గౌతమేశ్వరస్వామి ఆలయాలను గురువారం కలెక్టర్‌ సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ సుందిళ్లలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వద్ద రోడ్ల మరమ్మతు పనులు, బ్యారెజీవద్ద రోడ్డు డబుల్‌లైన్‌ ఏర్పాటుకు ఆదేశాలుజారీచేసినట్లు తెలిపారు. మంథని గౌతమేశ్వర ఆలయంవద్ద గోదావరి పుష్కరాల సమయంలో రోజుకు రెండులక్షల వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంద న్నారు. సురబండేశ్వర్‌స్వామి ఆలయంనుంచి ఘాట్‌వద్ద ఇన్‌అండ్‌ఔట్‌పోస్టుల ఏర్పాటుకు అధికారులకు ఆదే శాలు జారీచేశారు. ఈ పర్యటనలో ఆర్డీవో గంగయ్య, సురేష్‌, దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ సుప్రియ, ఇవైటీఎం జైదీప్‌, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

పిల్లల ఎదుగుదలను మానిటర్‌ చేయాలి..

పెద్దపల్లి కల్చరల్‌: పిల్లల ఎదుగుదలను నిరంతరం మానిటర్‌ చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో సంక్షేమ శాఖ పనితీరుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్‌వాడీకేంద్రాలు నిబంధనల మేరకు పనిచే యాలని అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌లను ఆదేశిం చారు. జిల్లాలోని 90అంగన్‌వాడీ కేంద్రాల మర మ్మతుల కోసంరూ.2లక్షలచొప్పున నిధులు మంజూరు చేశామని సద్వినియోగం చేయాలన్నారు. గర్భిణులు, బాలింతలు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చి ఒకపూటభోజనం తీసుకునేలా చూడాలని అన్నారు. ప్రతివారం అంగన్‌వాడీ టీచర్ల సూపర్‌వైజర్ల పని తీరును పరిశీలిస్తానన్నారు. సమావేశంలో జిల్లా సంక్షే మ అధికారి వేణుగోపాల్‌ రావు, సీడీపీవోలు అలేఖ్య, పుష్ప, అధికారులు పాల్గొ న్నారు.

Updated Date - Feb 06 , 2026 | 12:58 AM