ఒలింపిక్స్‌లో ప్రాతినిఽథ్యం వహించేందుకు కృషి
ABN , Publish Date - Feb 18 , 2026 | 12:58 AM
ప్రపంచ వ్యాప్తంగా ఒలం పిక్స్‌లో రాణించాలన్నది ప్రతి క్రీడాకారుడి లక్ష్యమని, తెలంగాణ రాష్ట్రం నుంచి ఒలింపిక్స్‌కు ప్రాతినిథ్యం వహించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని వేములవాడ శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ, ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ వ్యాప్తంగా ఒలం పిక్స్‌లో రాణించాలన్నది ప్రతి క్రీడాకారుడి లక్ష్యమని, తెలంగాణ రాష్ట్రం నుంచి ఒలింపిక్స్‌కు ప్రాతినిథ్యం వహించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని వేములవాడ శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశా లలో జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 8వ రాష్ట్రస్థాయి యూత్‌వాలీబాల్ పోటీలను మంగళవారం జ్యోతిప్రజ్వలన చేసి ప్రారం భించారు. ఈసందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వాలీబాల్ ఆ డేందుకు ఆయా జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులకు స్వాగతం పలి కారు. వేములవాడలో వాలీబాల్ పోటీలు నిర్వహించాలని నిర్వహకులు అడిగిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ ప్రాంతంలో రుద్రంగిలో వాలీ బాల్ క్రీడాకారులు చాలా మంది ఉన్నారని, జాతీయ స్థాయిలో రాణిం చారని గుర్తు చేశారు. కబడ్డీలో సనుగుల, మూడపల్లి, నూకలమర్రి, చెక్కపల్లి గ్రామాల్లో అనేక మంది క్రీడాకారులు ఉన్నారని గుర్తు చేశా రు. మట్టిలో మాణిక్యాలాంటి క్రీడాకారులు వేములవాడలో చాలామంది ఉన్నారని వారి ప్రతిభను వెలికితీసేందుకు పోటీలు చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులు రాణించేందుకు ప్రభుత్వం ప్రోత్సా హం అందిస్తుందన్నారు. యువత సెల్ ఫోన్‌లకు అలవాటుపడి వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని, సెల్ ఫోన్‌లో వచ్చే ఆన్‌లైన్ గేమ్‌ల తో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అన్నారు. ఈ వయస్సులో చెడు మార్గంలోకి వెళ్లకుండా క్రీడలవైపు యువత దృష్టిసారించాలని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి క్రీడాకారులకు సీఎం కప్ ఏర్పాటు చేశారన్నారు. గ్రా మీణ ప్రాంతాల్లో మంచి నైపుణ్యం కలిగిన క్రీడాకారులను బయటకు తీసుకురావడమే సీఎం కప్ లక్ష్యమన్నారు. సుమారుగా 45కు పైగా క్రీడలను సీఎం కప్ క్రీడా పోటీలలో చేర్చడం జరిగిందని వివరించారు. గ్రామీణ, మండల, రాష్ట్ర స్థాయిలో క్రీడాకారులను వెలికి తీస్తున్నామని తెలిపారు. క్రీడలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఒక ప్పటి గ్రామీణ క్రీడలపై ఇంకా ఆదరణ అలాగే ఉందని గుర్తు చేశారు. గత ప్రభుత్వంం 9 ఏళ్లుగా డైట్ చార్జీలు పెంచలేదని, కాంగ్రెస్ వచ్చాక డైట్ చార్జీలు 40 శాతం పెంచిందన్నారు. యంగ్ ఇండియా రెసిడెన్షియ ల్ స్కూల్ ఏర్పాటు కోసం స్థలం సేకరణ జరుగుతుందని, రాష్ట్ర స్థాయి క్రీడాకారులు ఇవ్వాళ ఉన్నది వేములవాడ రాజన్న ఆలయ సన్నిధిలో అని అన్నారు. గత ప్రభుత్వం స్టేడియం నిర్మాణం పక్కన పెట్టిందని, నేడు ప్రజా ప్రభుత్వం స్డేడియం నిర్మాణ పనులు ముమ్మరంగా జరు గుతున్నాయని తెలిపారు. వేమువాడ పట్టణంలో త్వరలోనే మూడు ఎకరాల్లో ఇండోర్ స్టేడియం నిర్మాణం చేపడుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రంఽథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్‌చైర్మన్ నరాల శేఖర్, మార్కెట్ కమిటీ చైర్మ న్ రొండి రాజు, రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జెల రమే ష్‌బాబు, రాష్ట్ర కార్యదర్శి హనుమంత్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గిన్నె లక్ష్మణ్, జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకుమార్, ఉపాధ్యాక్షుడు గోగికారి శ్రీనివాస్, కార్యదర్శి రాందాస్, కౌన్సిలర్లు, తది తరులు ఉన్నారు.