Share News

వైఎస్‌ఆర్‌ ఆశయ సాధనకు కృషి

ABN , Publish Date - Sep 03 , 2026 | 12:27 AM

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆశయ సాధనకు కాంగ్రెస్‌ శ్రేణు లు కృషి చేయాలని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీని వాస్‌ సూచించారు.

వైఎస్‌ఆర్‌ ఆశయ సాధనకు కృషి

వేములవాడ, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆశయ సాధనకు కాంగ్రెస్‌ శ్రేణు లు కృషి చేయాలని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీని వాస్‌ సూచించారు. వేములవాడ పట్టణం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధ వారం వైఎస్‌ఆర్‌ వర్ధంతి సందర్బంగా చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఈ సంద ర్భంగా విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ బడు గుబలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా వైఎస్‌ ఆర్‌ పని చేశారని కొనియాడారు. కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడంతో పాటు ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు మండుటెండల్లో సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి ప్రజల మన్ననలు పొందారని గుర్తు చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పేదల సంక్షేమం, రైతుల అభివృద్ధి, విద్య, వైద్య రంగా లకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. వైఎస్‌ఆర్‌ మరణం కాంగ్రెస్‌ పార్టీకి, ప్రజలకు తీరని లోటని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు, పట్టణ అధ్య క్షుడు తూమ్‌ మధు, కాంగ్రెస్‌ నాయకులు తది తరులు ఉన్నారు.

Updated Date - Sep 03 , 2026 | 12:27 AM