Share News

సత్వర న్యాయం అందించేందుకు కృషి

ABN , Publish Date - Mar 08 , 2026 | 12:43 AM

కోర్టు కేసుల్లో ఉన్న వారందరికీ సత్వర న్యాయం అందించేందుకు అన్ని వసతులతో కూడిన నూతనకోర్టు భవన సముదాయాలను ప్రతి జిల్లా కేంద్రంలో అధునిక పద్ధతితో నిర్మిస్తున్నామని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ అన్నారు.

సత్వర న్యాయం అందించేందుకు కృషి
సిరిసిల్లలో కోర్టు భవన నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న హైకోర్టు న్యాయమూర్తులు

- అన్ని జిల్లా కేంద్రాలల్లో కోర్టు భవనాలు

- హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌సింగ్‌

- సిరిసిల్లలో కోర్టు భవనానికి శంకుస్థాపన

- పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తులు

సిరిసిల్ల అర్బన, మార్చి 7 (ఆంఽధ్రజ్యోతి): కోర్టు కేసుల్లో ఉన్న వారందరికీ సత్వర న్యాయం అందించేందుకు అన్ని వసతులతో కూడిన నూతనకోర్టు భవన సముదాయాలను ప్రతి జిల్లా కేంద్రంలో అధునిక పద్ధతితో నిర్మిస్తున్నామని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సుమారు ఐదెకరాల విస్తీర్ణంలో రూ. 81 కోట్ల 60లక్షల వ్యయంతో 12 రకాల న్యాయస్థానాలు, టెనప్లస్‌ టూ పద్ధతిలో భవన నిర్మాణానికి శనివారం భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేష్‌కుమార్‌సింగ్‌ వర్చువల్‌ విధానంలో శంకుస్థాపనలో పాల్గొనగా హైకోర్టు న్యాయమూర్తులు జిల్లా కోర్టు పరిపాలన న్యాయమూర్తి జస్టిస్‌ తుకారాంజీ, జస్టిస్‌ లక్ష్మణ్‌, జస్టిస్‌ విజయ్‌సేనరెడ్డి, జస్టిస్ట్‌ నందికొండ నర్సింగరావు, జస్టిస్‌ ఈవీ వేణుగోపాల్‌రావు, జస్టిస్‌ పుల్లా కార్తీక్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ, కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, ఎస్పీ మహేష్‌ బీగీతేలు పాల్గొని భవన నిర్మాణాలకు భూమిపూలు చేసి సర్వమత ప్రార్థనల మధ్య శిలాఫకాలన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో వర్చువల్‌ విధానంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌సింగ్‌ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణకు కృషి చేయాలన్నారు. నూతన కోర్టు భవన సముదాయంతో కోర్టుకు వచ్చే కక్షిదారులకు సత్వరన్యాయం అందించే దిశగా న్యాయవాదులు , న్యాయమూర్తులు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. జిల్లా కోర్టులో 13వేల కేసులు పైగా పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడించారు. పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని, సంబంధిత అధికారులు సమన్వయంలో పనిచేయాలని ఆదేశించారు.

- విశ్వాసాన్ని పెంపొందించేందుకు కృషి

నూతన కోర్టు భవన నిర్మాణం ప్రజల్లో న్యాయవ్యవస్థపై మరింత విశ్వాసాన్ని పెంపొందించేవిధంగా కొత్త అధ్యాయానికి నాందిగా నిలుస్తుందని హైకోర్టు న్యాయమూర్తి జిల్లా కోర్టు పరిపాలన న్యాయమూర్తి జస్టిస్‌ తుకారాంజీ అన్నారు. రాజ్యాంగం అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రతీ ఒక్కరికి సామాజిక న్యాయం అందేలా న్యాయవ్యవస్థ పనిచేయాలన్నారు. ప్రతి ఒక్కరు న్యాయస్థానాన్ని అశతో, నమ్మకంతో అశ్రయించేలా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నూతన కోర్టు భవనం నిర్మాణాం ద్వారా ప్రజలకు మరింత పారదర్శకంగా సమర్ధవంతంగా సేవలు అందేలా అవకాశం ఏర్పడుతుందన్నారు.

- సంపదకు, చరిత్రకు నిలయం

సిరిసిల్ల జిల్లా చరిత్ర, సంస్కృతి, పరిశ్రమలలతో ప్రసిద్ధిపొందిన ప్రాంతం అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీరజ అన్నారు. టెక్స్‌టైల్‌ మరమగ్గాల పరిశ్రమల కేంద్రంగా ఎదిగి వేలాది కుటుంబాలకు ఉపాఽధిని కల్పిస్తుందన్నారు. సిరిసిల్ల జిల్లా ప్రత్యేకతల్లో నేత కార్మికుల పాత్ర ఎంతో గొప్పదన్నారు. ఇక్కడి నేత కార్మికులు తయారు చేసిన చీరలు, పాఠశాల విద్యార్థుల యూనిఫాంలు ఇతర వస్త్రాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయని వేలాది కుటుంబాలు ఈ టెక్స్‌టైల్‌, వస్త్ర పరిశ్రమలపై అధారపడి జీవిస్తున్నాయని అన్నారు.

- ల్యాప్‌టాప్‌ల పంపిణీ

జిల్లా సంక్షేమశాఖ ఆధ్వర్యంలో దివ్యాంగ డిగ్రి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న పలువురు విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లతోపాటు బ్యాటరీ సైకిళ్లు, ఎంపవర్‌ కార్డులను హైకోర్టు న్యాయమూర్తులు , జిల్లా ప్రధాన న్యాయమూర్తి, కలెక్టర్‌, ఎస్పీలు పంపిణీ చేశారు. అనంతరం చిన్నారు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు నృత్యాలు అలరించాయి.

- హైకోర్టు న్యాయమూర్తులకు సన్మానం

హైకోర్టు న్యాయమూర్తులును జిల్లా కోర్టు, బార్‌ అసోసియేషన్ల ఆధ్వర్యంలో కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, ఎస్పీ మహేష్‌బీగీతే సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య, జిల్లా 1వ అదనపు జడ్జి పుష్పలత, పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జీ లక్ష్మాణాచారి, వేములవాడ సీనియర్‌ సివిల్‌ జడ్జి అజయ్‌కుమార్‌ జాదవ్‌, ఆర్డీవో వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ప్రవీణ్‌, వేములవాడ జూనియర్‌ సివిల్‌ జడ్జి జ్యోతిర్మయి, సిరిసిల్ల అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కావేటి సృజన, గడ్డం మేఘన, సిరిసిల్ల, వేములవాడ బార్‌ అసోషియేషన అధ్యక్షులు జూపల్లి శ్రీనివాసరావు, గుడిసె సదానందం, డీఎస్పీ నాగేంద్రచారి, తహసీల్దార్‌ మహేష్‌కుమార్‌, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 08 , 2026 | 12:43 AM