Share News

సేవాలాల్‌ మహారాజ్‌ ఆశయ సాధనకు కృషి

ABN , Publish Date - Feb 16 , 2026 | 01:10 AM

బంజారా, గిరిజన జీవితాల్లో వెలుగులు నింపిన మహాన్నతమూన వ్యక్తి సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ అని, ఆయన ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు అన్నారు.

సేవాలాల్‌ మహారాజ్‌ ఆశయ సాధనకు కృషి

ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి, ఫిబ్రవరి 15 (ఆంధ్ర జ్యోతి): బంజారా, గిరిజన జీవితాల్లో వెలుగులు నింపిన మహాన్నతమూన వ్యక్తి సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ అని, ఆయన ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు అన్నారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో శ్రీ సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రాలతో పాటు బుగ్గరాజేశ్వరతండా, బాకురుపల్లితండా, దేవునిగుట్టతండా, గుండారం, మద్దిమల్ల, బంజేరుతండా, అడవిపదిర, వన్‌పల్లి, శాంతినగర్‌, లాల్‌సింగ్‌నాయక్‌తండా, రంగంపేట, తదితర గిరిజన గ్రామాల్లోని జగదాంబదేవీ ఆలయాల వద్ద భక్తిశ్రద్ధల నడుమ ప్రత్యేక పూజలు జరిపి భోగ్‌ బండార్‌ను జరిపించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ చిత్ర పటంతో భారీ ప్రదర్శన నిర్వహించారు. రంగంపేటలోని జగదాంబ ఆలయం వద్ద నిర్వహించిన వేడుకల్లో ఆర్డీవో వెంకటేశ్వర్లు హాజరై మాట్లాడారు. సేవాలాల్‌ బంజారాలకే కాకుండా ప్రపంచానికే ఆదర్శమన్నారు. సేవాలాల్‌ ఆలోచ న విధానాలను పాటించాన్నారు. గిరిజన సంస్కృతిని కాపాడేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో అధికారులు, సర్పంచులు, తండా పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

ఫ గంభీరావుపేట : గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు జగదాంబతండ, మక్తానాయక్‌ తండా తదితర గ్రామాల్లో సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. బంజరాల ఆరాద్య గురువు సంత్‌ సేవాలాల్‌ జయంతి సందర్భంగా జగదాంబతండ, దమ్మన్న పేట, ముస్తాఫనగర్‌, గంభీరావుపేట వరకు తెల్ల జెండాలతో బైక్‌ర్యాలీ నిర్వహించారు. సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ బంజరాల కోసం చేసిన కృషిని ఈ సంధర్బంగా గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో అజ్మీరా సాయి, చరణ్‌, సురెందర్‌, భాస్కర్‌, గోవింద్‌నాయక్‌,గోఫి, విఠల్‌, రాజేందర్‌, విగ్నేష్‌, దేవేందర్‌ తదితరులు ఉన్నారు.

ఫ చందుర్తి : చందుర్తి మండలం దేవుని తండా గ్రామపంచాయతీ పరిధిలో బంజారాల ఆరాధ్య దైవం సంత్‌ సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా తండాలో హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవుని తండా నుండి చందుర్తి మండలం వరకు యువకులు, భక్తులు భారీ సంఖ్యలో బైక్‌ ర్యాలీ నిర్వహిం చారు. ఆలయంలో స్వామివారికి విశేష అభిషే కాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ భూక్య మోహన్‌, ఆలయ కమిటీ చైర్మన్‌ అజ్మీరా చంద్రు నాయక్‌, బిఆర్‌ఎస్‌ యూత్‌ మండల అధ్యక్షులు భూక్యా గబ్బర్‌ సింగ్‌ నాయకులు, బిక్య, గోపాల్‌, మొబి లాల్‌, భూక్యా లక్ష్మన్‌, బలరాం, రాములు, అగన్‌, తిరుపతి, రాజు, గున్యా, మోహన్‌, మాల్యా, తిరుపతి, గణేష్‌, రవి, యువకులు మహిళలు పాల్గొన్నారు.

Updated Date - Feb 16 , 2026 | 01:11 AM