అమరవీరుల ఆశయ సాధనకు కృషి
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:01 AM
అమరవీరులకు మరణం లేదు జగతి ఉన్నంతకాలం సజీవంగా ఉంటారని ఎంఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు ఖానాపురం లక్ష్మణ్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి) : అమరవీరులకు మరణం లేదు జగతి ఉన్నంతకాలం సజీవంగా ఉంటారని ఎంఎస్‌పీ జిల్లా అధ్యక్షుడు ఖానాపురం లక్ష్మణ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తా వద్ద మాదిగ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులకు ఎంఎస్‌పీ, ఎంఆర్పీఎస్, వీహెచ్‌పీఎస్ నాయకులు పూలతో నివాళులర్పిం చారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ మాదిగ అమరవీరులను జాతి త్యాగదనులను వారు చేసిన త్యాగాలను మాదిగ జాతి ఎన్నటికి మరవదని వారి పోరాట స్పూర్తిని విడవదన్నారు. మాదిగ అమరవీరులు చిందించన నెత్తుటి చుక్కల సాక్షిగా ఎస్సీ వర్గీకరణను సాధించుకున్నా మన్నారు. జాతి కోసం మందకృష్ణ మాదిగ సారధ్యంలో అమరుల త్యాగాల ను భవిష్యత్తు తరాలకు చరిత్రగా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు ఆవునూరి ప్రభాకర్, ఎమార్పీఎస్ జిల్లా కన్వీనర్ ఎలగందుల బిక్షపతి, వీహెచ్‌పీఎస్ జిల్లా కన్వీనర్ శోభరాణి, నాయకులు వెంకట్, భగవంతం, శ్రీనివాస్, నల్లబాబు, రాజశేఖర్, ప్రసాద్, ప్రతాప్, తిరుపతి రాజయ్య పాల్గొన్నారు.