Share News

అమృత్‌లాల్‌శుక్లా ఆశయాల సాధనకు కృషి

ABN , Publish Date - Jan 15 , 2026 | 12:08 AM

స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే అమృత్‌లాల్‌ శుక్లా ఆశయాల సాధనకు కృషి చేయాలని సీపీఎం జిల్లా కార్య దర్శి మూషం రమేష్‌ కోరారు.

అమృత్‌లాల్‌శుక్లా ఆశయాల సాధనకు కృషి

సిరిసిల్ల రూరల్‌, జనవరి 14 (ఆంధ్రజ్యోతి) : స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే అమృత్‌లాల్‌ శుక్లా ఆశయాల సాధనకు కృషి చేయాలని సీపీఎం జిల్లా కార్య దర్శి మూషం రమేష్‌ కోరారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో బుధవారం సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అమృ త్‌లాల్‌ శుక్లా వర్ధంతి నిర్వహిం చారు. కార్యక్రమానికి అమృత్‌లాల్‌ శుక్లా తనయుడు శాంతిప్రకాష్‌ శుక్లా, మనుమడు స్వాధిక్‌ కుమార్‌ శుక్లాలు పాల్గొని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం జరిగిన సమావేశం లో రమేష్‌ మాట్లాడుతూ భూమి, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం, నైజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి పోరాడిన గొప్ప నాయకుడని అన్నారు. సిరిసిల్ల ప్రాంత ఎమ్మెల్యేగా పీడిత వర్గాల ప్రజలకు అయన చేసిన సేవలు మరువలేనివన్నారు. అమృ త్‌లాల్‌ శుక్లా ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణ, జిల్లా కమిటీ సభ్యులు గురజాల శ్రీధ ర్‌, రాపెల్లి రమేష్‌, రామంచ అశోక్‌, నక్క దేవదాస్‌, సిరిమల్లసత్యం, ఎలిగేటి రాజశేఖర్‌, ఈసంపెల్లి రాజె ల్లయ్య, దాసరి రూప, ఎలిగేటి శ్రీనివాస్‌, కోల శ్రీని వాస్‌, జిందం కమలాకర్‌, జెజుగం సురేష్‌, బాస శ్రీధర్‌, బింగి సంపత్‌, గడ్డం రాజశేఖర్‌,పత్తిపాక శ్రీని వాస్‌, సందుపట్ల పోచమల్లు, గోవర్ధన్‌, సాయి తది తరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 15 , 2026 | 12:08 AM