Share News

సమాన అవకాశాల కల్పనకు కృషి

ABN , Publish Date - Feb 05 , 2026 | 12:03 AM

అందరికి సమాన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఇన్‌చార్జి కలెక్ట ర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు.

సమాన అవకాశాల కల్పనకు కృషి

సిరిసిల్ల అర్బన్‌, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి) : అందరికి సమాన అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఇన్‌చార్జి కలెక్ట ర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో బుధవారం తెలంగాణ సామాజిక న్యాయ, ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవా లను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇన్‌చార్జి కలెక్టర్‌ అధికారులతోపాటు వచ్చిన ప్రజలందరితో సామాజిక న్యాయ దినోత్సవం సంద ర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జరిగిన సమావే శంలో ఇన్‌చార్జి కలెక్టర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని నిర్వ హిస్తుందని వివరించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 ప్రకారం అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. అన్ని శాఖల అధికారులు నిబంధనలకు అనుగు ణంగా తమ కార్యాలయంలోని అటెండర్‌ నుంచి అన్ని స్థాయిల అధికారులకు సమాన అవకాశాలు కల్పించాలని, అన్ని వర్గాల పేద, బడుగు బలహీన వర్గాల వారికి ప్రభు త్వ ఫలాలు అందించాలని సూచించారు. ప్రభుత్వ హాస్టళ్ల లో చదివే అవకాశం వచ్చిన విద్యార్థులు మంచిగా అభ్యసిం చి, ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షాంచారు. ఉన్నత ఉద్యోగాలు, స్థానాల్లో స్థిరపడి తమ ప్రాంతంలోని వారికి ఆదర్శంగా నిలువాలని పిలుపునిచ్చారు ఈ ఏడాది యూనై టెడ్‌ బై యూనిక్యూ అనే నినాదంతో ప్రపంచ క్యాన్సర్‌ దినో త్సవాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లాలోని అన్ని వైద్యశాలల్లో క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు చేస్తున్నారని తెలి పారు. వీటిని ప్రజలందరు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రోగ నిర్ధారణ జరిగితే ఉన్నత దవాఖానల్లో వైద్యం, మందులు అందిస్తున్నారని తెలిపారు. క్యాన్సర్‌ అంటువ్యాధి కాదని, వారిని చేరదీసి వైద్య సహాయం అం దించాలని సూచించారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌ మాట్లాడుతూ అభివృద్ధి, ప్రగతి కార్యక్రమాల్లో అన్ని వర్గాలతో ముందుకు వెళ్ళాలనేది ప్రభుత్వ నిర్ణయమ ని తెలిపారు. ప్రభుత్వ ఫలాలు అందరికీ అందేలా చూడా లని సూచించారు. క్యాన్సర్‌పై డాక్టర్‌ హారిక వివరించారు. పొగాకు ఉత్పత్తులు, తినే.. మద్యం తాగేవారికే ఎక్కువగా క్యాన్సర్‌ వస్తుందని తెలిపారు. అలాగే రెడీమేడ్‌ ఫుడ్స్‌ ఎక్కు వ ప్రాసెస్‌ చేసిన ఫుడ్స్‌తో క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉందని వివరించారు. రోజు వారి ఆహారంలో కూరగాయలు, పండ్లు తీసుకోవాలని, నిత్యం వ్యాయామం చేయాలని సూచిం చారు. క్యాన్సర్‌ నిర్ధారణ, వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్‌రెడ్డి, బీసీ సంక్షేమ అధికారి సౌజన్య, మైనార్టీ సంక్షేమ అధికారి భారతి, ఎస్టీ సంక్షేమ అధికారి సంగీత, జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, సీపీవో శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 05 , 2026 | 12:03 AM