Share News

కుల, మతాలకు అతీతంగా అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Mar 15 , 2026 | 11:59 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల, మతాలకు అతీతంగా అభివృద్ధికి కృషి చేస్తుందని వేములవాడ ఎమ్మె ల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

కుల, మతాలకు అతీతంగా అభివృద్ధికి కృషి

వేములవాడ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుల, మతాలకు అతీతంగా అభివృద్ధికి కృషి చేస్తుందని వేములవాడ ఎమ్మె ల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. పట్టణ శివారులోని అయ్యో రుపల్లి గ్రామ సమీపంలో ఆరే క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం శివాజీ భవన్‌ నిర్మాణా నికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ సామాజిక సేవా దృక్పథంతో రాజన్న భక్తులకు నిత్యాన్నదానం ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో భవన నిర్మాణం చేపట్టేం దుకు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. భవనానికి తమ వంతు సహాయ సహకారాలు అందించనున్నట్లు తెలిపారు. వేములవాడ పట్టణ వ్యాప్తంగా 54 కుల సంఘాలను గుర్తించి ఒక్కో సంఘానికి రూ. 5 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశామని అన్నారు. కుల, మతాలకు అతీ తంగా పట్టణంలో అభివృద్ధి జరగాలన్నదే తమ ఎకైక లక్ష్యమని తెలిపారు. ఆరే క్షత్రియ కులస్తులు కమిటీ ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా శివాజీ భవన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఆరే క్షత్రియ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ, జిల్లా అధ్యక్షుడు సిలివేని మల్లేశం, పట్టణ అధ్యక్షుడు అశోక్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు, వైస్‌ చైర్మన్‌ నరాల శేఖ ర్‌, మార్కెట్‌ కవిటీ చైర్మన్‌ రొండి రాజు, వైస్‌చైర్మన్‌ కనికరపు రాకేష్‌ కౌన్సిల ర్లు, ఆరే సంఘం నాయకులు ఉన్నారు.

Updated Date - Mar 15 , 2026 | 11:59 PM