బహుజన రాజ్య సాధనకు కృషి
ABN , Publish Date - Mar 15 , 2026 | 11:56 PM
రాష్ట్రంలో బహుజ న ర్యాజం సాధించినప్పుడే కాన్షీరాంకు నిజమైన నివాళి అని, దీని కోసం బహుజనలందరు కృషి చేయాలని బీఎస్‌పీ రాష్ట్ర కో-ఆర్డి నేటర్ బోయిని చంద్రశేఖర్‌ముదిరాజ్ కోరారు.
సిరిసిల్ల అర్బన్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో బహుజ న ర్యాజం సాధించినప్పుడే కాన్షీరాంకు నిజమైన నివాళి అని, దీని కోసం బహుజనలందరు కృషి చేయాలని బీఎస్‌పీ రాష్ట్ర కో-ఆర్డి నేటర్ బోయిని చంద్రశేఖర్‌ముదిరాజ్ కోరారు. సిరిసిల్లలో ఆదివా రం రాత్రి బహుజన సమాజ్ పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాన్షీరాం 92వ జయంతి వేడుకల బహిరంగ సభను నిర్వహించా రు. ఈ సందర్భంగా కాన్షీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చీఫ్ జోన్ ఇన్‌చార్జ్ నిషాని రామచంద్రం, ఎనగందుల వెంకన్న అధ్యక్షతన జరిగిన సభలో బోయిని చంద్రశేఖర్ ముదిరాజ్ మాట్లాడుతూ దేశంలో అణగారి న కులాల్లో రాజకీయ కాంక్షను రగిలించి మహాత్మా ఫూలే, సాహు మహారాజ్, బాబాసాహెబ్ అంబేద్కర్‌లు ప్రారంభించిన సామాజి క పరివర్తన ఉద్యమాన్ని కొనసాగించేందుకు ఆయన సర్వస్వం ధారబోశారన్నారు. బహుజన ఉద్యమాన్ని నిర్మించి రాజకీయ అధికారా న్ని అందించిన గొప్ప మహానుభావుడు కాన్షీరాం అని కొనియాడారు. ఈ సభలో బీఎస్‌పీ నాయకులు మాతంగి అశోక్, నీరడి ఈశ్వర్, కల్లె పల్లి రాజేందర్, జిల్లా అధ్యక్షుడు కొమ్మట అశోక్, జిల్లా ప్రధాన కార్యద ర్శి లింగంపల్లి మహేష్, ఎడ్ల అరుణ్‌కుమార్, కోమ్మాట వేణు, కట్కూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.