మాదక ద్రవ్యాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు
ABN , Publish Date - Nov 27 , 2026 | 12:11 AM
జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమరవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అధికా రులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు.
సిరిసిల్ల అర్బన్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమరవాణాకు అడ్డుకట్ట వేసేందుకు అధికా రులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం మదక ద్రవ్యాల నియంత్రణ కు జిల్లాలో చేపడుతున్న చర్యలు, అమలుచేయాల్సిన కార్యాచరణపై జిల్లాస్థాయి నార్కోటిక్ కంట్రోల్ కమిటీ సమావేశాన్ని నిర్వహించా రు. ఈసందర్భంగా జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, విక్రయాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై అదనపు కలెక్టర్ అడిగితెలుసుకున్నారు. విద్యా సంస్థలు, కళాశాలలు, యువత ఎక్కువగా ఉండే ప్రాంతా ల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు,అనుమానాస్పద కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండేలా వి ద్యార్థులకు అవగాహన కల్పించాలని, తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తనపై శ్రద్ధ వహించేలా అవగాహన కార్యక్ర మాలు చేపట్టాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు అల వాటు పడిన వారిని గుర్తించి, వారికి అవసరమైన వైద్య చికిత్స, కౌన్సెలింగ్ అందించాలన్నారు. అనుమానిత ప్రాంతాలపై నిఘా కొనసాగిస్తూ, ఇతర శాఖల సహకారంతో తనిఖీలు, అవగా హన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశం లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ హిమశ్రీ, సెష్పల్ బ్రాంచ్ డీఎస్పీ గాండ్ల వెంకటేశ్వర్లు, డీఏఓ అఫ్జల్‌బేగం, సిరిసిల్ల, వేములవాడ ము న్సిపల్ కమిషనర్లు ఖదీర్ పాషా, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.