Share News

కట్టుదిట్టంగా రోడ్డు భద్రతా చర్యలు

ABN , Publish Date - Jan 14 , 2026 | 12:26 AM

రోడ్డు భద్రతా చర్య లను కట్టుదిట్టంగా చేపట్టాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదే శించారు.

కట్టుదిట్టంగా రోడ్డు భద్రతా చర్యలు

సిరిసిల్ల కలెక్టరేట్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): రోడ్డు భద్రతా చర్య లను కట్టుదిట్టంగా చేపట్టాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదే శించారు. కలెక్టరేట్‌లో మంగళవారం రోడ్డు భవనాల శాఖ, నేషనల్‌ హైవేస్‌, పంచాయతీరాజ్‌, పోలీస్‌, ట్రాన్స్‌పోర్ట్‌, వైద్యం, ఎక్సైజ్‌, విద్య, ఆర్టీసీ తదితర శాఖల అధికారులతో రోడ్డు సేఫ్టీ కమిటీ సమావేశాన్ని ఇన్‌చార్జి కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. గత నెలలో నిర్వహించిన కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించారు. సిద్దిపేట నేషనల్‌ హైవే, వేములవాడ-కోరుట్ల మార్గం, కరీంనగర్‌-కామారెడ్డి మార్గం, సిరిసిల్ల-కరీంనగర్‌ మార్గంలో గుర్తించిన బ్లాక్‌ స్పాట్స్‌ల వద్ద రంబుల్‌స్ట్రిప్స్‌, సోలార్‌ సిగ్నల్స్‌, సైన్‌ బోర్డ్స్‌, రోడ్ల మరమ్మతు, కనెక్టింగ్‌ రోడ్ల కోసం పక్కా ప్రణాళిక తయారు చేసి, వచ్చే సమావేశంలో దానికి సంబంధించిన, అభివృద్ధి పనుల వివరాలను తెలపాలని ఆదేశించారు. అలాగే రహదారుల్లో స్పీడ్‌గన్స్‌, సీసీకెమెరాల ఏర్పాటుకు ఆయా శాఖల అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, ఇప్పటికే ఉన్న వాటిని మరోసారి పరిశీలించాలని సూచించారు.

ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించాలి

జిల్లాలోని అన్ని పెట్రోల్‌ బంక్‌లలో కచ్చితంగా నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌ అమలుచేయాలని, ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. ప్రతి బంకు యజమాని సామాజిక బాధ్యతగా దీనిని విజయవంతంచేయాలని పిలుపునిచ్చారు. ఎక్కువ రోడ్డు ప్రమా దాల్లో ఎక్కువ మరణాలు, క్షతగాత్రులు అవుతుంది ద్విచక్ర వాహనదా రులేనని స్పష్టం చేశారు. తమ, కుటుంబ సంరక్షణ కోసం హెల్మెట్‌ తప్పకుండా ధరించాలని సూచించారు. పరిమితికి మించి విద్యార్థుల ను, ప్రయాణీకులను తరలిస్తున్న ఆటోలు, బస్సులను తనిఖీ చేయాల ని, ఓవర్‌లోడ్‌తో వెళ్లే సరుకు వాహనాలపై దృష్టి సారించాలని రవాణా శాఖ అధికారులను ఇన్‌చార్జి కలెక్టర్‌ ఆదేశించారు.

పది రోజులపాటు అరైవ్‌.. అలైవ్‌ అమలు

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అరైవ్‌.. అలైవ్‌ జిల్లాలో 10 రోజులపాటు అమలు చేస్తామని ఎస్పీ మహేష్‌ బీ గీతే తెలిపారు. ఇందులో భాగంగా ట్రాఫిక్‌ నియమా లు, రోడ్డుభద్రత నియమాలపై అవగాహన కల్పించేందుకు వ్యాసరచన, క్విజ్‌, ఇతర పోటీలు విద్యార్థులకు, యువతకు నిర్వహిస్తామన్నారు. సిరిసిల్ల, వేములవాడలో ప్రధాన రోడ్లపై ఆక్రమణలు తొలగించాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు. బ్లాక్‌ స్పాట్స్‌, ఇతర రద్దీ స్థలా ల్లో బారికేడింగ్‌ చేయిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్టీఏ సభ్యుడు సంగీతం శ్రీనాథ్‌,ఈఈ ఆర్‌అండ్‌ బీ నరసింహాచారి, డీటీవో లక్ష్మణ్‌, పంచాయితీ రాజ్‌ ఈఈ సుదర్శన్‌ రెడ్డి, నేషనల్‌ హైవే డీఈ అన్నయ్య, ఆర్‌అండ్‌బీ డీఈ శాంతయ్య, డీఈవో వినోద్‌ కుమార్‌, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ రజిత, ఎక్సైజ్‌ అధి కారి శ్రీనివాస్‌రావు, జిల్లా పౌరసరఫరాల అధికారి చంద్రప్రకాశ్‌, మున్సి పల్‌ కమిషనర్లు ఖదీర్‌ పాషా, అన్వేష్‌, సిరిసిల్ల ఆర్టీసీ డీఎం ప్రకాష్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 14 , 2026 | 12:26 AM