Share News

పకడ్బందీగా పీసీపీఎన్‌డీటీ చట్టం అమలు

ABN , Publish Date - Nov 12 , 2026 | 11:59 PM

జిల్లాలో పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఏంజెలా ఆల్ర్ఫె డ్‌ అన్నారు.

పకడ్బందీగా పీసీపీఎన్‌డీటీ చట్టం అమలు

సిరిసిల్ల టౌన్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఏంజెలా ఆల్ర్ఫె డ్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రం డీఎంహెచ్‌వో కార్యాలయంలో పీసీపీఎన్‌ డీటీ సలహా కమిటీ సభ్యులతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఏంజెలా ఆల్ర్ఫె డ్‌ అధ్యక్షతన సమావేశం జరిగింది. జిల్లాలో పీసీపీఎన్‌డీటీ చట్టం అమలు తీరు, స్కానింగ్‌ కేంద్రాల నిర్వహణ, నిబంధనలు పాటింపు తదితర అంశాలపై సమీ క్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చట్టరీత్యా నేరమని, ఈ నేరానికి పాల్పడితే జైలుశిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని అన్ని స్కానింగ్‌ కేంద్రాలు తప్పనిసరిగా నిబం ధనలను పాటించాలని సూచించారు. ఉల్లంఘించే కేంద్రాలపై చట్టపరమైన కఠి న చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం తంగళ్ళపల్లి మండలం, నేరెళ్ల గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇటీవల ఓ మాతృమరణ కేసును కమిటీ సభ్యులు సమీక్షించారు. ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో నాగేంద్రబాబు, వైద్యులు సుగుణ, సంగీతారెడ్డి, పరమేష్‌, చంద్రిక, ఐఎంఏ ప్రతి నిధి, సీహెచ్‌ సంతోష్‌, మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు చింతోజు భాస్కర్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రజినీకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2026 | 11:59 PM