Share News

పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు

ABN , Publish Date - May 03 , 2026 | 12:16 AM

రైతులకు ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీగా ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌ ఆదేశిం చారు.

పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ సత్యప్రసాద్‌

-కలెక్టర్‌ సత్యప్రసాద్‌

కొడిమ్యాల, మే 2(ఆంధ్రజ్యోతి): రైతులకు ఇబ్బందులు కలుగకుండా పకడ్బందీగా ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌ ఆదేశిం చారు. శనివారం కొడిమ్యాల మండలంలోని గంగారాంతండా, కొడిమ్యాల, చెప్యాల గ్రామాలలో ఐకేపీ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్‌ సందర్శించారు. రైతులకు ఏమైనా సమస్యలు ఉన్నా యా అని అడిగి తెలుసుకున్నారు. కేంద్రాలకు వచ్చిన ధాన్యం మ్యాచర్‌ వచ్చిన వెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలని సంబంధిత అఽధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌ అన్నారు. తూకం, నిల్వ, రవాణాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని ఈసందర్భంగా సిబ్బం దికి సూచించారు. కలెక్టర్‌ వెంట డీఎస్‌వో జితెందర్‌రెడ్డి, డీఎం జితేంద్ర ప్రసాద్‌, తహసీల్దార్‌ నరేష్‌, ఏపీఎం మల్లేశం, సర్పంచ్‌ వినోద్‌నాయక్‌, సీసీలు వీరకుమార్‌, మరియా, వీవోఏలు రాజేశ్వరీ, అన్నపూర్ణ, స్రవంతి కొనుగోలు కమిటీ సభ్యులు, రైతులు ఉన్నారు.

Updated Date - May 03 , 2026 | 12:16 AM