నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
ABN , Publish Date - Jan 27 , 2026 | 11:53 PM
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పమేలాసత్పతి మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
కరీంనగర్ టౌన్, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి పమేలాసత్పతి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. కల్టెర్ మంగళవారం నామినేషన్ల స్వీకరణకు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించి డివిజన్ల వారీగా ఏర్పాటు చేసిన కౌంటర్లను తిలకించారు. అభ్యర్థులు వచ్చే మార్గం, వెళ్లే మార్గం వేర్వేరుగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిబంధనలను పాటిస్తూ నామినేషన్లను స్వీకరించాలన్నారు. నామినేషన్ల స్వీకరణ నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని పోలీసు కమిషనర్ గౌస్ అలం తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ నగరంలోని 66 డివిజన్ల నామినేషన్ల స్వీకరణకు 33 గదుల్లో ఏర్పాట్లు చేశామని తెలిపారు.