మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Nov 28 , 2026 | 12:27 AM
మద్యం సేవించి మత్తులో వాహనాలు నడిపితే కఠి న చర్యలు తప్పవని ఎస్పీ మహేష్ బీ గితే హెచ్చ రించారు.
వేములవాడ, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): మద్యం సేవించి మత్తులో వాహనాలు నడిపితే కఠి న చర్యలు తప్పవని ఎస్పీ మహేష్ బీ గితే హెచ్చ రించారు. వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధి లో మద్యం సేవించి పట్టుబడిన వాహనదారులకు శుక్ర వారం కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను నివారిం చడంతో పాటు, వాహనదారులకు ట్రాఫిక్ నిబంధ నలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నామని పేర్కొ న్నారు. మత్తులో వాహనాలు నడపడంతో నియం త్రణ కోల్పోయి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, ఒక్కరి నిర్లక్ష్యం కారణంగా వారి ప్రాణాలతోపాటు ఇతరుల ప్రాణాలను సైతం ప్రమాదంలోకి నెట్టుతుందని అన్నారు. రోడ్డు ప్రమా దాలకు ప్రధాన కారణాల్లో మద్యం సేవించి వాహ నాలు నడపడం, అతివేగం, హెల్మెట్ ధరించకపో వడం, రాంగ్‌రూట్‌లో ప్రయాణించడం, మైనర్లు డ్రైవింగ్ చేయడమే కారణమన్నారు. ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. అరై వ్‌అలైవ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై విస్తృతంగా అవగహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలు, వా హనదారుల్లో చైతన్యం కల్పిస్తున్నామని తెలిపారు. రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వెద్య సహాయం అం దించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎమ్ రాహత్ పథకం ద్వారా రూ.1.50 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవ లు అందబాటులో ఉన్నాయన్నా రు. అనంతరం మద్యం సేవించి పట్టు బడిన వాహనదారులతో మద్యం సేవించి వాహనాలు న డపబోమని ప్రతిజ్ఞ చేయించారు. వారి వెంట టౌన్ సీఐ వీరప్ర సాద్, ఎస్సైలు ప్రేమనందం, రాజు, శ్రీనివాస్ ఉన్నారు.