మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు
ABN , Publish Date - Jun 10 , 2026 | 12:50 AM
మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, రోడ్డుప్రమాదాల నివారణ లక్ష్యంగా పోలీసులు నిత్యం తనిఖీలు చేపట్టాలని ఎస్పీ మహేష్ బీగీతే ఆదేశించారు. సిరిసిల్ల పట్టణంలోని ఎల్లమ్మ
సిరిసిల్ల అర్బన్, జూన్ 9 (ఆంఽధ్రజ్యోతి): మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని, జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, రోడ్డుప్రమాదాల నివారణ లక్ష్యంగా పోలీసులు నిత్యం తనిఖీలు చేపట్టాలని ఎస్పీ మహేష్ బీగీతే ఆదేశించారు. సిరిసిల్ల పట్టణంలోని ఎల్లమ్మ సర్కిల్ వద్ద మంగళవారం రాత్రి పోలీసులు తనిఖీలు చేస్తుండగా జిల్లా ఎస్పీ పాల్గొని క్షేత్ర స్థాయిలో తనిఖీలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా విధుల్లో ఉన్న అధికారులకు ,సిబ్బందికి అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తుల వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, వాహనాల డాక్యుమెంట్లు పరిశీ లించాలని సూచించారు.సరైన పత్రాలు లేని వాహనాలు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నెంబర్ ప్లేట్లు కలిగిన వాహ నాలను సీజ్ చేయాలని, మైనర్లు వాహనాలు నడుపు తున్నట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈసంద ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొం దించడమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమన్నారు. ట్రాఫిక్ నిబంధనలను ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా పాటిం చాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ వినియోగించాలని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసాంఘిక శక్తులు, అనుమానిత వ్యక్తుల కట్టడి నేరాల నివారణ కోసమే జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ తనిఖీలకు ప్రజలందరూ సహకరించాలని ఎస్పీ కోరారు. సిరిసిల్ల టౌన్ ట్రాఫిక్ ఆర్‌ఎస్‌ఐ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.