Share News

దొంగిలించిన సెల్‌ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలు

ABN , Publish Date - Jul 18 , 2026 | 11:59 PM

దొంగిలింలిన సెల్‌ఫోన్లను కొనుగోలు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ మహేష్‌ బీగీతే అన్నారు.

దొంగిలించిన సెల్‌ఫోన్ల కొనుగోలు, విక్రయాలపై కఠిన చర్యలు

సిరిసిల్ల అర్బన్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి) : దొంగిలింలిన సెల్‌ఫోన్లను కొనుగోలు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ మహేష్‌ బీగీతే అన్నారు. సిరిసిల్ల జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శనివారం జిల్లాలోని సెల్‌ఫోన్‌ దుకాణాల యజమానులు, రిపేరర్లతో సమావే శాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దొంగలించిన, పోగొట్టుకున్న సెల్‌ ఫోన్‌లను అమ్మడంతో పాటు ఎక్స్ఛేంజీ చేయ డానికి వచ్చిన వారితో అప్రమత్తంగా వ్యవహ రిస్తూ వారి ఆధార్‌ కార్డ్‌లతోపాటు పూర్తి వివ రాలు తీసుకోవాలన్నారు. ఎవరైనా అనుమానా స్పదంగా కనిపించినా, దొంగిలించిన సెల్‌ఫోన్ల విక్రయానికి ప్రయత్నిస్తున్నట్లు అనుమానం వచ్చినా వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. సెల్‌ ఫోన్‌ దొంగలను పట్టించడంతోపాటు ఆచూకీ పోలీసులకు అందించడంలో సహకరించిన సెల్‌ఫోన్‌ యజమానులకు జిల్లా పోలీసుల తర ఫున ప్రశంసాపత్రం అందజేస్తామన్నారు. సెకండ్‌హ్యాండ్‌ సెల్‌ఫోన్‌ కొనుగోలు చేసే సమ యంలో సంబంధిత దుకాణాల యజమాని నుంచి తప్పనిసరిగా బిల్లు లేదా రసీదు తీసుకో వాలన్నారు. తక్కువ ధరకు లభిస్తుందనే ఆశతో దొంగిలించబడిన సెల్‌ఫోన్‌లను తెలియక కొను గోలు చేసి అమాయక ప్రజలు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దొంగిలిం చబడిన సెల్‌ఫోన్‌ అని తెలిసి కూడా కొనుగోలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. సెల్‌ఫోన్‌ విక్రయించా లనుకునే వారు సంబంధిత కంపెనీల స్టోర్‌ లలో ఎక్స్ఛేంజ్‌ లేదా చట్టబద్ధమైన విక్రయ కేంద్రాల ద్వారానే విక్రయించాలని, గుర్తుతెలి యని వ్యక్తులకు లేదా అనధికారికంగా కొనుగో లు చేసే షాపులకు విక్రయించవద్దని సూచిం చారు. ఇటువంటి దొంగిలించబడిన సెల్‌ఫోన్‌ లు సైబర్‌ నేరాలకు వినియోగించే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. అందరి సహకారంతోనే నేరాల నియత్రించవ చ్చన్నారు. ఎవరైన మొబైల్‌ పోగొట్టుకున్న, దొంగిలించబడిన వెంటనే సీఈఐఅర్‌ ఫోర్టల్‌లో బ్లాక్‌ చేసి, సంబంధిత పోలీసు స్టేషన్‌లో సమా చారం ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశం లో ఐటీ కోర్‌ ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌, కానిస్టేబుల్‌ రాజాతిరుమలేష్‌లు పాల్గొన్నారు.

Updated Date - Jul 18 , 2026 | 11:59 PM