Share News

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

ABN , Publish Date - Apr 29 , 2026 | 12:08 AM

జిల్లాలో ఎక్కడైనా నకిలీ విత్తనా లు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ హెచ్చరించారు.

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

సిరిసిల్ల, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఎక్కడైనా నకిలీ విత్తనా లు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లో రానున్న ఖరీఫ్‌ సీజన్‌ నేపథ్యంలో నకిలీ విత్తనాల నియంత్రణ, సన్న వడ్ల, ఆయిల్‌ పామ్‌ సాగు విస్తీర్ణం పెంపు, ఫార్మర్‌ రిజిస్ట్రీ పూర్తి తదితర అంశాలపై వ్యవసాయ, ఉద్యానవన, సహకార, పోలీస్‌శాఖ అధికారులతో అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి సమీక్షించారు. వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన సన్న వడ్ల రకాలు, ఆయిల్‌పామ్‌ సాగు పూర్తి వివరాలతో రూపొందించిన కరపత్రాలను కలెక్టర్‌, అధికా రులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మా ట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా ఏ విధమైన నకిలీ విత్తనాలు విక్రయాలు, కంపెనీ వివరాలు లేకుండా విడిగా విత్తనాల అమ్మకాలు చేయకుండా వ్యవసాయ, పోలీస్‌ శాఖ సంయుక్తంగా దాడులు చేయాలని, ఏమైనా విక్రయాలు ఉంటే వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. నేరుగా వచ్చి విత్తనాలు విక్రయించే వారి వద్ద రైతులు తీసుకోవద్దని సూచించారు. జిల్లాలో ఫార్మర్స్‌ రిజిస్ట్రీ ఇప్పటిదాకా 73 శాతం పూర్తి చేశారని వెల్లడించారు. వ్యవసాయ అధికారులు తమ పరిధిలోని కొను గోలు కేంద్రాలు, రైతులను నేరుగా కలిసి ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలో సన్న వడ్లు సాగు విస్తీర్ణం పెంచాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌షాప్‌లు, రెసిడెన్షియల్‌ విద్యాలయాలు, మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం పంపిణీ చేస్తుందని తెలిపారు. అలాగే రూ 500 బోనస్‌ కూడా ఇస్తుందని వెల్లడించారు. జిల్లాలోని రైతులు సన్నవడ్లు సాగు చేసేలా యాజమాన్య పద్ధతులు తెలిపి ప్రోత్సహించాలని అన్నారు.. ధాన్యం కొనుగోలుకు ఇబ్బంది ఉండదని తెలిపారు. ఆయిల్‌పామ్‌ పం టసాగు ద్వారా అధిక దిగుబడితో పాటు దీర్ఘకాలంపాటు అధిక ఆదా యాన్ని పొందవచ్చని, పంట సాగుకు రైతులు ముందుకు వచ్చేలా వివరించాలని ఆదేశించారు. ఆసక్తి ఉన్న రైతులను వ్యవసాయ, ఉద్యా నవన శాఖ అధికారులు నేరుగా కలిసి మాట్లాడాలని ఆదేశించారు. ఉద్యానవన శాఖ అధికారులకు 500 ఎకరాలు, మండల వ్యవసాయ అధికారులకు 50 ఎకరాలు, ఏఈవోలకు 30ఎకరాలు, ప్రతి పీఏసీఎస్‌ బాధ్యులు 120 ఎకరాల చొప్పున లక్ష్యంగా నిర్ణయించి ఆయిల్‌ పామ్‌ సాగుకు రైతులు డీడీలు చెల్లించేలా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి అఫ్జల్‌ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్‌బాబు, జిల్లా సహకార శాఖ అధి కారి రామకృష్ణ తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 29 , 2026 | 12:08 AM