Share News

‘ఉపాధి’ పనుల నిర్లక్ష్యంపై కఠిన చర్యలు

ABN , Publish Date - Apr 25 , 2026 | 12:27 AM

ఉపాధిహామీ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు.

‘ఉపాధి’ పనుల నిర్లక్ష్యంపై కఠిన చర్యలు
కథలాపూర్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ సత్యప్రసాద్‌

- కలెక్టర్‌ సత్యప్రసాద్‌

కథలాపూర్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): ఉపాధిహామీ పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ హెచ్చరించారు. జిల్లాలోనే కథలాపూర్‌, మల్లాపూర్‌ మండ లాల్లో ఉపాధి పనులకు కూలీలు తక్కువగా వస్తున్నారని అధికారులు, సిబ్బంది నిర్లక్యం వల్లే ఈ పరిస్థితి నెలకొందని కలెక్టర్‌ తెలి పారు. మండల స్వశక్తి భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో 13 లక్షల పనిదినాలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుంటే ఇప్పటికి కేవలం మూడు లక్షల పనిదినాలు మాత్రమే పూర్తయ్యాయన్నారు. కూలీల పనిదినాలు పెరిగితేనే మెటీరియల్‌ కాంపొనెంట్‌కు అధికంగా నిధులు రావడానికి అవకాశం ఉందని చెప్పారు. గ్రామాల్లో కార్యదర్శులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు కూలీలను ప్రోత్సహించాల ని పని ప్రదేశాల వద్ద నీడ కోసం షేడ్‌ నెట్లు, తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు తప్పనిసరిగా ఏర్పాటుచేయాలని సూ చించారు. కథలాపూర్‌, బొమ్మెన గ్రామాల్లో కూలీలు అతి తక్కువగా ఎందుకువస్తున్నారని పంచాయతీ కా ర్యదర్శులను ప్రశ్నించారు. తప్ప నిసరి గా ప్రతీ గ్రామంలో 200 మందికి తక్కువ కాకుండా కూలీలు పనులకు వచ్చేలా చూడాలన్నారు. 40శాతం లక్ష్యంగా నిర్ణయించుకుని పనులు చేపట్టాలన్నారు. పనిచేయకపోతే ఇతర మండలాల నుంచి అధికారులను తెప్పించి పనులు పూర్తి చేస్తానన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీవో రఘువరన్‌, కోరుట్ల ఆర్డీవో జివాకర్‌రెడ్డి, తహసీల్దార్‌ రమేశ్‌, ఎంపీడీవో శంకర్‌నాయక్‌, పంచాయతీ కార్యదర్శులు, ఏఈలు పాల్గొన్నారు.

నిబంధనల ప్రకారం జనగణన చేపట్టాలి

కోరుట్ల, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నిబంధనల ప్రకారం జనగణన నిర్వహించి విజయవంతం చేయాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఎన్యూమరేటర్ల్‌, సూపర్‌వైజర్లులకు సూచించారు. శుక్రవారం పట్టణంలోని బాలికల పాఠశాలలో కోరుట్ల ఆర్డీవో జీవకర్‌రెడ్డితో కలిసి జనగణన 2027పై నిర్వహిస్తున్న శిక్షణ తరగతులను కలెక్టర్‌ సత్యప్రసాద్‌ పరిశీలించారు. శిక్షణ అందిస్తున్న విదానంపై జిల్లా కలెక్టర్‌ ఆరా తీసారు. అనంతరం కలెక్టర్‌ సత్యప్రసాద్‌ పలు సూచనలు సలహాలను అందించారు. ఇంటింటి వివరాలు సేకరణ విధానం, డిజిటల్‌ పద్దతులో డేటా నమోదు ప్రజలతో వ్యవహరించే తీరు, గోప్యత పరిరక్షణ వంటి అంశాలపై వివరంగా అవగాహన కలిగి ఉండాలన్నారు. జనగణనకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ కృష్ణచైతన్య, ఎన్యూమరేట ర్లు, సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2026 | 12:27 AM