Share News

రుణాల దుర్వినియోగం, మోసాలపై కఠిన చర్యలు

ABN , Publish Date - Jul 07 , 2026 | 11:57 PM

రుణాల దుర్విని యోగం, మోసాలకు సంబంధించిన కేసులపై నిర్లక్ష్యం ప్రదర్శించకుండా, చట్టపరమైన చర్యలు తీసుకుని, నిబం ధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, స్త్రీనిధి రుణాల పంపిణీ, రికవరీ ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ గరి మ అగ్రవాల్‌ ఆదేశించారు.

రుణాల దుర్వినియోగం, మోసాలపై కఠిన చర్యలు

సిరిసిల్ల, జూలై 7 (ఆంధ్రజ్యోతి): రుణాల దుర్విని యోగం, మోసాలకు సంబంధించిన కేసులపై నిర్లక్ష్యం ప్రదర్శించకుండా, చట్టపరమైన చర్యలు తీసుకుని, నిబం ధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని, స్త్రీనిధి రుణాల పంపిణీ, రికవరీ ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ గరి మ అగ్రవాల్‌ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, మండల ఏపీఎంలతో స్త్రీనిధి ద్వారా మహిళా స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్న రుణాల పంపిణీ, రికవరీ, రుణాల దుర్విని యోగంపై తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధి కారతకు స్త్రీనిధి తోడ్పడుతుందని, సంఘాలకు అవసర మైన రుణాలు సకాలంలో అందేలా చూడడంతో పాటు, మండలాల వారీగా పనితీరు నిరంతరం సమీక్షిస్తూ లక్ష్య సాధనకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని, మహిళల ఆర్థికాభివృద్ధికి స్త్రీనిధి కార్యక్రమాలను సమర్థ వంతంగా అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ 113 కోట్ల వార్షిక రుణ లక్ష్యం ఉందన్నారు., లక్ష్య సాధనలో వెనుకబడిన మండ లాలపై ప్రత్యేక దృష్టి సారించి, అర్హత కలిగిన స్వయం సహాయక సంఘాలను గుర్తించి వేగంగా రుణాలు మంజూరుచేయాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి మండలస్థాయి వరకు అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. జిల్లాలో రికవరీ శాతాన్ని పెం చడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జీరో రికవరీ ఉన్న స్వయం సహాయక సంఘాలను గుర్తించి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. సంబంధిత మండల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిం చి సంఘాలతో సమావేశాలు నిర్వహించి, బకాయిల వసూళ్లపై అవగాహన కల్పించాలన్నారు. పాల ఉత్పత్తి, గొర్రెల పెంపకం, బ్యాక్‌ యార్డ్‌ పౌలీ్ట్ర, మదర్‌ యూనిట్లు, క్యాంటీన్లు, పీఎంఎఫ్‌ఎంఈ, గృహ మరమ్మతులు, రూఫ్‌టాప్‌ సోలార్‌, ఈ-బైక్‌లు, ఈ-ఆటో లు వంటి జీవనోపాధి కార్యక్రమాలకు అర్హులైన సంఘాలను ప్రోత్సహించి మరిం త మందికి రుణాలు అందేలా చూడాలని సూచించారు. మన స్త్రీనిధి మొబైల్‌ యాప్‌ వినియోగాన్ని విస్తృతం చేయాలని తెలిపా రు. ప్రతి స్వయంసహాయక సంఘ సభ్యు రాలు యాప్‌ను వినియోగించేలా అవగా హన కల్పించాలని, యాప్‌ ద్వారా రుణవివరాలు, ఈఎం ఐలు, చెల్లింపులు, పొదుపు వివరాలు, బీమా సమాచా రం తదితర సేవలను సులభంగా పొందవచ్చన్నారు. సమావేశంలో శిక్షణ డిప్యూటీకలెక్టర్‌ నిఖిత, జిల్లా గ్రామీ ణాభివృద్ధి శాఖ అధికారి లక్ష్మీనారాయణ, జిల్లా పశు సంవర్ధక శాఖ రవీందర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్‌బేగం, జిల్లా సహకారశాఖ అధికారి రామ కృష్ణ, మత్స్యశాఖ అధికారి సౌజన్య, పంచాయితీ అధికారి జయశీల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2026 | 11:57 PM