ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:25 AM
ప్రభుత్వ ఆదేశాలకు అను గుణంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి ‘మన ఇసుక వాహనం’ ఆన్ లైన్ విధానం ద్వారా నిర్మాణ పనులకు ఇసుక సరఫరా అవుతుం దని కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెల్లడించారు.
సిరిసిల్ల, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆదేశాలకు అను గుణంగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి ‘మన ఇసుక వాహనం’ ఆన్ లైన్ విధానం ద్వారా నిర్మాణ పనులకు ఇసుక సరఫరా అవుతుం దని కలెక్టర్ గరిమ అగ్రవాల్ వెల్లడించారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మన ఇసుక వాహనం ఆన్‌లైన్ విధానం, ఇసుక సరఫరా తదితర అం శాలపై జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశాన్ని ఎస్పీ మహేష్ బి గితే, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వచ్చేనెల 1వ తేదీ నుంచి మన ఇసుక వాహనం ద్వారా ఇసుక సరఫరా చేయాలని సూచించారు. జిల్లా కమిటీ ఆమోదించిన ఇసుక రీచ్‌ల నుంచే ఇసుక తరలించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇసుక ఇబ్బందులు రావద్దని స్పష్టం చేశారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మండల, డివిజన్, జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ బృందాలు ఏర్పాటు చేయాలని, ఆయా ఇసుక రీచ్‌లను రెవెన్యూ, పోలీస్ అధికారులు తనిఖీ చేయాలని సూచించారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. ఎస్పీ మహేష్ బి గితే మట్లాడుతూ జిల్లాలోని ఇటుక ఇటుక బట్టీలు నిబంధనలకు అనుగుణంగా అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిర్ణీత సమయంలోనే ఇసుక సరఫరా చేయాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసు కుంటామని హెచ్చరించారు. నిరంతరం నిఘా పెడతామని స్పష్ట చేశా రు. ఈ సమావేశంలో జిల్లా మైనింగ్ అధికారి క్రాంతి కుమార్, డీఎస్పీ నాగేంద్రచారి, జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ కుమార్, కలెక్టరేట్ పర్యవేక్షకులు ప్రవీణ్, నీటిపారుదల, భూగర్భజల, అధికారులు, తహసీ ల్దార్లు, ఎస్‌హెచ్‌వోలు తదితరులు పాల్గొన్నారు.