వీధి వ్యాపారులు అభివృద్ధి చెందాలి
ABN , Publish Date - Jul 01 , 2026 | 12:04 AM
పీఎం ఆత్మ నిర్భర్ నిధి పథ కం ద్వారా వీధి వ్యాపారులు వారి కుటుంబాలు ఆర్థిక సామాజిక పురోగ తితో పాటు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి అన్నారు.
సిరిసిల్ల టౌన్, జూన్ 30 (ఆంధ్రజ్యోతి) : పీఎం ఆత్మ నిర్భర్ నిధి పథ కం ద్వారా వీధి వ్యాపారులు వారి కుటుంబాలు ఆర్థిక సామాజిక పురోగ తితో పాటు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రం సీనారే కళా మందిరంలో మున్సిపల్ మెప్మా ఆధ్వర్యంలో పీఎం స్వనిధి మహోత్సవ్ నిర్వహించగా ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్‌పర్సన్ హాజరయ్యారు. ముందుగా వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు, బ్యాంక్ రుణ మంజూ రు పత్రాలను చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి, అధికారులు పంపిణి చేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ వీధి వ్యాపారుల సంక్షే మం కోసం కరోనా సమయంలో పీఎం ఆత్మ నిర్భర్ నిధి పథకం ప్రారం భించుకోవడం జరిగిందన్నారు. ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులను గుర్తించి వారికి మొదటి విడతగా రూ.10వేలు బ్యాంకు రుణం అందించా మన్నారు. రెండవ విడతగా రూ. 20వేలు, మూడో విడతగా రూ. 50 వేలు వీధి వ్యాపారుల అభివృద్ధికి అందించడం జరిగిందన్నారు. అర్హులైన వీధి వ్యాపారులు వారి కుటుంబాల ఆర్థిక సామాజిక పురోగతిని మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఈ సారి మొదటి విడత రూ. 15వేలు, రెండవ విడత రూ. 25వేలకు పెంచి ఇస్తామని వివరించారు. అర్హులైన వీధి వ్యాపారులు బ్యాంకుల నుంచి రుణాలను పొంది వ్యాపారాలు అభి వృద్ధి చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ ఎండీ ఖాదీర్ పాషా, మెప్మా ఏవో ఫసహద్ ఆలీబేగ్, మున్సిపల్ కౌన్సిలర్లు దార్నం అరుణ, దూడం రజనీ, బొద్దుల శ్రీనివాస్, లంగంపల్లి గంగరాజు, కోఆప్షన్ సభ్యులు నంది శంకర్, కొండ అనూషా, బ్యాంకు అధికారులు, మెప్మా అధికారులు, మున్సిపల్ సిబ్బంది, వీధి వ్యాపారులు పాల్గొన్నారు.