గాలివాన బీభత్సం..
ABN , Publish Date - Apr 05 , 2026 | 11:34 PM
ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో శనివారం అర్ధరాత్రి గాలి వాన బీభత్సం సృష్టించింది.
ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి, ఏప్రిల్5(ఆంధ్రజ్యోతి): ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో శనివారం అర్ధరాత్రి గాలి వాన బీభత్సం సృష్టించింది. ఉరు ములు, మెరుపులతో కూడిన భారీ వర్షానికి పల్లెలు అతలకుతలమయ్యా యి. మండల కేంద్రాలతో పాటు అక్కపల్లి, రాజన్నపేట, తిమ్మాపూర్, కంచ ర్ల, రంగంపేట, వన్‌పల్లి, అడవిపదిర తదితర గ్రామాల్లోని వృక్షాలు నేలకూలాయి. విద్యుత్‌తీగలు తెగిపోయాయి. భారీ గాలికి రేకులు ఎగిరిపోయి అల్లంతా దూరాన పడ్డాయి. వీర్నపల్లి మండల కేంద్రంలో గోడ కూలి ఇంటి పక్కన నిలిపిన ఆటో, కారుపై పడడంతో దెబ్బతిన్నాయి. మామిడి, చేతికి వచ్చిన వరి గింజలు నేలరాలాయి. ఆరబోసిన ధాన్యం తడిసిముద్దయింది. పలు గ్రామాల్లో విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. చెట్లు రహదారులకు అడ్డుగా విరిగిపడడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు సహాయక చర్యలు చేపట్టారు. ధాన్యంపై కప్పిన కవర్లలో నిలిచిన వర్షపు నీటిని తొలగించేందుకు రైతులు అవస్థలుపడ్డారు. తడిసిన ధాన్యం, వరి పొలాలను చూసి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తమను ఆదుకోవాలని ప్రజలు, రైతులు కోరుతున్నారు.
కోనరావుపేట : కోనరావుపేట మండలం మరిమడ్లలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. సుమారు 90 శాతం వరి పంట నేలరాలింది. గింజ గింజకు ప్రాణం పోసి కాపాడుకుంటే నేలరాలిందని రైతులు రోదిస్తున్నారు. మరిమడ్లలో ఆదివారం తెల్లవారుజామున కురిసిన వడగండ్ల వానకు 90 శాతం వరి పంట దెబ్బతింది. గ్రామానికి చెందిన సబ్బుపట్ల వసంత, అక్కనపెల్లి రమేష్, కుమ్మరి ఆదిబాబు, రాజు, మల్లేశం, కుమ్మరి దిలీప్, కు మ్మరి రాజు, మొండయ్య, మైసయ్య, చంద్రయ్య, శ్రీనివాస్, గోవర్ధన్‌తోపాటు గ్రామంలో పూర్తిస్థాయిలో వరి పంట నేలరాలాయి. నేల రాలిన వరి పంట ను చూసి రైతులు కన్నీరు పెడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పని చేస్తే చేతికొచ్చిన పంట నేరరాలిందని కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వం అధికా రుల చేత దెబ్బతిన్న వరి పంటను సర్వే చేయించి రైతాంగాన్ని ఆదుకోవాల ని మరిమడ్ల గ్రామ రైతులు కోరుతున్నారు.
రైతులు అధైర్య పడవద్దు.. ఆదుకుంటాం : విప్
రైతులు ఆధ్వర్యంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో వడగళ్ల వానతో దెబ్బతిన్న పంటలను ఆదివారం అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆదివారం తెల్లవారు జామున కురిసిన వర్షానికి సుమారు 200 పైచిలుకు ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. చేతికి అందిన పంట నేలరారడం బాధాకరమని అన్నారు. నష్టపోయిన పంట వివరాలను సేకరించి ప్రభుత్వానికి అందజే స్తానని తెలిపారు. గతంలో నష్టపోయిన రైతంగానికి ఏ ప్రభుత్వం కూడా నష్టపరిహారం అందించలేదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో రైతన్న ఆదుకుంటున్నామని అన్నారు. అధికారులు పూర్తిస్థాయి లో పంట నష్టం వివరాలు సేకరించాలని ఆదేశించారు. వెంట కాంగ్రెస్ నా యకులు కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, బాల్‌రెడ్డి, ఉప్పుల గంగయ్య, సుంకరి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బి.బాలరాజు, మురళి, గ్రామ సర్పంచ్ కోల స్వాతి, శ్రీనివాస్, తాళ్లపల్లి ప్రభాకర్, నీరటి సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.
పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలి
కోనరావుపేట : అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల రైతులను ఆదుకో వాలని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య కోరారు. కోనరా వుపేట మండలం మరిమడ్లలో వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను ఆదివారం పరిశీలించి మాట్లాడారు. మరిమడ్ల గ్రామంలో సుమారు 90 శాతం వరి పంట, ఇతర పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. ప్రభుత్వం అధికారుల చేత సర్వే చేయించి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా సర్పంచ్ కోల స్వాతి, శ్రీనివాస్, బిఆర్‌ఎస్ నాయకులు ప్రతా పరెడ్డి, శ్రీనివాస్, మహేందర్ తదితరులు ఉన్నారు. అలాగే మరిమడ్ల గ్రామంలో ఆదివారం వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను బీజేపీ మం డల అధ్యక్షుడు మిర్యాల్‌కార్ బాలాజీ పరిశీలించారు. నష్టపోయిన రైతుల ను ఆదుకోవాలని కోరారు. ఈసందర్భంగా బీజేపీ నాయకులు గొట్టె రామ చంద్రం, సర్పంచ్ జయరాం, బైరగోని సురేష్ గౌడ్, మోత్కు మోహన్, చీకటి మధు, కుమ్మరి దిలీప్, మాట్ల రమేష్, తొట్ల అరుణ ఉన్నారు.
గంభీరావుపేట : మండలంలోని సముద్రలింగాపూర్‌లో ఆదివారం తెల్లవారుజామున ఈదురుగాలులతో కూడిన రాళ్ల వాన కురిసింది. వర్షానికి వరి పంట నేలకొరిగింది. చేతికి అందివచ్చిన పంట నేల రాలి పోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గ్రామానికి చెందిన నర్సింహా రెడ్డి, రాజిరెడ్డి, మల్లేశం, అంజయ్య, ఎల్లం, నారాయణరెడ్డి తదితర రైతుల పంటలు వడగళ్ల వానతో దెబ్బతిన్నాయి. సర్పంచ్ గంగసాయవ్వ, ఏఈవో ముకుందం పంట నష్టాలను పరిశీలించారు.