Share News

కుట్టు మిషన్లకు గట్టిపోటీ

ABN , Publish Date - Oct 09 , 2026 | 12:54 AM

ఇందిరమ్మ కుట్టుమిషనల కోసం కరీంనగర్‌ జిల్లాలో గట్టి పోటీ నెలకొంది.

కుట్టు మిషన్లకు గట్టిపోటీ

(ఆంధ్రజ్యోతి, కరీంనగర్‌)

ఇందిరమ్మ కుట్టుమిషనల కోసం కరీంనగర్‌ జిల్లాలో గట్టి పోటీ నెలకొంది. బీసీ మహిళల కొండంత ఆశతో వీటి కోసం నిరీక్షిస్తుండగా అర్హుల ఎంపిక అధికారులకు సవాలుగా మారింది. నియోజకవర్గానికి వెయ్యిమంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉండగా.. ఊహించని విధంగా మహిళలు వెల్లువలా దరఖాస్తులు చేసుకున్నారు. నిర్ణీత గడువును మించి గత నెలాఖరు 30వ తేదీ వరకు అవకాశం కల్పించడంతో దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇప్పటికే మైనారిటీ కార్పొరేషన ద్వారా జిల్లాలో కుట్టుమిషనల పంపిణీ జరిగింది. అదే విధంగా బీసీ సంక్షేమ శాఖ, బీసీ కార్పొరేషనలు వచ్చిన అర్జీలను పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఒకటిరెండు రోజుల్లోనే కసరత్తు మొదలు పెట్టనున్నారు.

ఎంపికకు మల్లగుల్లాలు

జిల్లా వ్యాప్తంగా 23,617 మంది దరఖాస్తు చేసుకోగా.. ఒక్కో మిషన కోసం సగటున నలుగురి నుంచి ఆరుగురు మహిళల మధ్య పోటీ నెలకొంది. కరీంనగర్‌, హుజూరాబాద్‌ నియోజకవర్గాల్లో ఆరుగురు పోటీ పడుతుండగా చొప్పదండి, మానకొండూర్‌ నియోజకవర్గాల్లో నలుగురిలో ఒకరికే మిషన దక్కే ఛాన్స ఉంది. రూ.12వేల విలువైన ఆటోమేటిక్‌ కుట్టు మిషనను 100 శాతం రాయితీతో అందిస్తుండటంతో దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ ఆశపడుతున్నారు. అయితే త్వరలో ఎంపికకు సంబంధించి పూర్తిస్థాయి మార్గదర్శకాలు జిల్లాకు రానున్నాయి. మొదట పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, నిరాశ్రయులు, అనాథలు, దివ్యాంగులకు ప్రాధాన్యతనిస్తారు. అలాగే కుట్టు పనిలో నైపుణ్యం, అనుభవమున్న వారిని ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. అయితే ఇప్పటికే వెలువడిన జీవోలో మాత్రం మండ ల, మున్సిపల్‌ స్థాయిలో ఏడు మంది సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశా లిచ్చారు. జిల్లాస్థాయిలో కలెక్టర్‌ నేతృత్వంలో 10 మంది సభ్యులతో ఉన్న మరోకమిటీ రెండో అంచెలో తుది జాబితా ఖరారు చేయనుంది. మొత్తంగా ఈ ప్రక్రియ కోసం క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది మల్లగుల్లాలు పడటం ఖాయమనిపిస్తోంది.

అర్జీలు ఇలా..

----------------------------------

నియోజకవర్గం వచ్చిన అర్జీలు

-----------------------------------

కరీంనగర్‌ 6,786

హుజూరాబాద్‌ 6,007

మానకొండూర్‌ 4,606

చొప్పదండి 4,112

హుస్నాబాద్‌ 2,106

--------------------------------

ఫ పక్కాగా పరిశీలన

ఆనలైనలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పక్కాగా పరిశీలించనున్నారు. అయితే ఎక్కువగా వయస్సు, ఇతర అర్హతల ప్రామాణికత విషయంలో కొన్ని దరఖాస్తులు మొదట్లోనే తిరస్కరణకు గురయ్యే అవకాశముంది. ఒకే కుటుంబం నుంచి వచ్చిన డూప్లికేట్‌ దరఖాస్తుల ను ముందుగా గుర్తిస్తారు. ముఖ్యంగా గతంలో ప్రభుత్వం ద్వారా ఏదైనా పథకం లబ్ధిని పొందారా..? అనే విషయాన్ని గమనిస్తారు. అన్నింటికన్నా ముఖ్యంగా అసలు అర్హతలన్నీ ఉన్నప్పటికీ వారు కుట్టుమిషనను ఇంట్లో ఉపయోగించే పరిస్థితి ఉందా..? లేదా అనే కోణం లోనూ ఆరా తీస్తారు. స్వయం ఉపాధి పరంగా కుట్టుమిషనతో ఆర్థిక స్వావలంబన పొందే వారికి పాధ్రాన్యతనిస్తారు. అసలు దరఖాస్తుదారు అదే చిరునామాలో ఉన్నారా..? లేరా అనే కోణంలోనూ విచారణ చేస్తారు. అయితే ఇందులో ఎలాంటి పైరవీలకు జోక్యం లేకుండా ఉంటే నే నిజమైన వారి ఇంటికి ఇందిరమ్మ కుట్టుమిషన చేరే వీలుంటుంది.

Updated Date - Oct 09 , 2026 | 12:54 AM