ధాన్యం కొనుగోళ్ల వేగవంతానికి చర్యలు
ABN , Publish Date - May 07 , 2026 | 11:53 PM
ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచి సకాలంలో కొనుగోళ్లలను పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధి కారులను అదేశించారు.
సిరిసిల్ల అర్బన్, మే7 (ఆంధ్రజ్యోతి): ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచి సకాలంలో కొనుగోళ్లలను పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధి కారులను అదేశించారు. సిరిసిల్ల అర్బన్ పరిధిలోని సర్ధాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం కలెక్టర్ గరిమ అగ్రవాల్ సందర్శించి కొనుగోలు ప్రక్రియలను పరిశీలించారు. ఈసందర్భంగా ధాన్యం రాశులు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో వేగం పెంచి పూర్తిచేయాలని కోరారు. కొనుగోలు చేసిన ధాన్యం కేటాయించిన ఽరైస్‌మిల్లుకు తరలించాలని సూచించారు. ఈ కార్య క్రమంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ నరిసింహా, మెప్మ ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, తహసీల్దార్ జయంత్‌కుమార్ తది తరులు పాల్గొన్నారు.