Share News

భక్తులు, పట్టణ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు

ABN , Publish Date - Jun 06 , 2026 | 12:16 AM

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులకు, పట్టణ వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మున్సి పల్‌ చైర్మన్‌ పుల్కం రాజు అన్నారు.

భక్తులు, పట్టణ ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు

వేములవాడ, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తులకు, పట్టణ వాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మున్సి పల్‌ చైర్మన్‌ పుల్కం రాజు అన్నారు. పట్టణంలోని నందికమాన్‌ చౌరస్తా ప్రాంతంలోని రోడ్డును ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ చౌరస్తా పరిసరాల్లో ప్రమాదాల నివారణు, వాహనాలు సులభంగా రాకపోకలు సాగించేందుకు తీసుకో వాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశా మన్నారు. రహదారులను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న నిర్వహకు లతో మాట్లాడి, భద్రతా కారణాల దృష్ట్యా అక్రమణలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని ఆదేశించారు. రోడ్లపూ తోపుడు బండ్లు, పండ్ల దుకా ణాలు నెట్టడం వల్ల రోడ్డు ఇరుకుగా మారి ప్రమాదాలకు కారణం అవు తుందని తెలిపారు. నిబంధనలన ఉల్లంఘించకుండా కేటాయించిన పరిధిలోనే వ్యాపారాలు చేసుకోవాలన్నారు. ఆయన వెంట మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ నరాల శేఖర్‌, కౌన్సిలర్‌ కాశ శ్రీనివాస్‌, కమిషనర్‌ లోకేష్‌ ఆర్‌అండ్‌బీ అధికారులు తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 06 , 2026 | 12:16 AM