Share News

తెలంగాణ సంక్షేమ పథకాల వైపు రాష్ట్రాల చూపు

ABN , Publish Date - Nov 21 , 2026 | 12:06 AM

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, కొనసాగుతున్న అభివృద్ధి పనుల వైపు దేశంలో ని రాష్ట్రాలు చూస్తున్నాయని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

తెలంగాణ సంక్షేమ పథకాల వైపు రాష్ట్రాల చూపు

వేములవాడ, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, కొనసాగుతున్న అభివృద్ధి పనుల వైపు దేశంలో ని రాష్ట్రాలు చూస్తున్నాయని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ పట్టణంలోని పలు వార్డుల్లో శుక్రవారం ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల స్వీకరణ ప్రా రంభం కార్యక్రమాలకు కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా వాల్‌ పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. అనంత రం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ కుటుంబంలో సంపాదించే వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబం ఆర్థి కంగా ఇబ్బందులు పడకుండా రూ.5లక్షల జీవి త బీమా అందించడం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. రాష్ట్రంలో కోటి ఐదు లక్షలకు పైగా కుటుంబాల కు గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించే బృహ త్తర కార్యక్రమని తెలిపారు. 18 నుంచి 59 ఏళ్ల వయస్సు కలిగిన ప్రతి ఒక్కరు ఈ పథకంలో నమోదు చేసుకోవాలని, కుటుంబంలో ఎవరిని ప్రధాన సభ్యుడిగా ఎంపిక చేసుకోవాలో వారే నిర్ణయించుకోవచ్చన్నారు. రేషన్‌కార్డులేని కుటుం బాలను సైతం పథకంలో భాగస్వాములను చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికా రులపై ఉందన్నారు. అనంతరం కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ ఈనెల12వ తేది నుంచి 18వ తేది వరకు ఇందిరమ్మ పెన్షన్‌ మంజూరు పత్రాలు పంపిణీ చేశామని తెలిపారు. అన్ని కుటుంబాలు తమ పరిధిలోని ప్రత్యేక నమోదు కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని అన్నా రు. డిసెంబరు 19వ తేదీవరకు శిబిరాలు నిర్వహిస్తామన్నారు. బీమా ఎవరి పేరిట ఉండాలి, నామినీ ఎవ రు ఉండాలో నిర్ణయం తీసుకోవాలని, నామినీ ఒక్కరు లేదా ఎక్కువ మందిని పెట్టుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు, ఆర్డీవో కేఎస్‌బి కుమారి, నోడల్‌ అధికారి, డీఆర్డీవో లక్ష్మీనారా యణ, జిల్లా ప్రణాళిక అధికారి సంపత్‌ కుమా ర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ లోకేష్‌, మెప్మా ఏవో మీర్జా ఫసహత్‌ అలీ బేగ్‌, ఈడీఎం శ్రీనివాస్‌, తహసీల్దార్‌ జయంత్‌ ఉన్నారు.

Updated Date - Nov 21 , 2026 | 12:06 AM