Share News

అట్టహాసంగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు..

ABN , Publish Date - Oct 03 , 2026 | 12:34 AM

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో రాష్ట్రస్థాయి 52వ బాలుర, 36వ బాలికల కబడ్డీ పోటీలు శుక్రవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి.

అట్టహాసంగా రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు..

వేములవాడ, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో రాష్ట్రస్థాయి 52వ బాలుర, 36వ బాలికల కబడ్డీ పోటీలు శుక్రవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. స్థానిక శాసన సభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఎస్పీ మహేష్‌ బి. గితేలు జ్యోతి ప్రజ్వలన చేసి, టార్చ్‌ వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 34 టీమ్‌ల బాలుర, బాలికల జట్లు కలిపి 68 కబడ్డీ టీమ్‌లు మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించాయి. ఈనెల 5న పోటీలు ముగియనున్నాయి.

గ్రామీణ క్రీడలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రోత్సాహం..

- వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

తెలంగాణ గ్రామీణ క్రీడలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. కబడ్డీ వంటి మట్టి క్రీడలకు ఎంతో చరిత్ర ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారికి సరైన వేదిక కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం వల్ల ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా క్రీడాకారులకు ఎంతో ప్రేరణ లభిస్తుందన్నారు. ఒక్కో జిల్లా నుంచి క్రీడాకారులతో పాటుగా పీటీలు, పీడీలతో కలిపి మొత్తంగా 1300 మందికి కబడ్డీ వేదికయిందన్నారు. ప్రజాపాలన వచ్చిన తరువాత సీఎం రేవంత్‌ రెడ్డి యువ క్రీడామైదానాలు బాటపట్టాలని, క్రమశిక్షణతో విద్యను అభ్యషించే క్రమంలో యువత సన్మార్గంలో నడువాలనే ఉద్దేశ్యంతోనే క్రీడాలకు ప్రాధన్యాతను కల్పిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నరాల శేఖర్‌ పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తూమ్‌ మధు, కౌన్సిలర్లు, కబడ్డీ అసోసియేషన్‌ జిల్లా, మండల అధ్యక్షులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 03 , 2026 | 12:34 AM