Share News

ఇన్‌చార్జి కలెక్టర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు ప్రదానం

ABN , Publish Date - Jan 26 , 2026 | 12:27 AM

ఓటర్ల నమోదు, ఓటరు అవగాహ న కార్యక్రమాలు, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణలో విశేష కృషి చేసి నందుకు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ రాష్ట్ర స్థాయిలో బెస్ట్‌ ఎల క్టోరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డును అందుకున్నారు.

ఇన్‌చార్జి కలెక్టర్‌కు రాష్ట్రస్థాయి అవార్డు ప్రదానం

సిరిసిల్ల, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ఓటర్ల నమోదు, ఓటరు అవగాహ న కార్యక్రమాలు, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణలో విశేష కృషి చేసి నందుకు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ రాష్ట్ర స్థాయిలో బెస్ట్‌ ఎల క్టోరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డును అందుకున్నారు. ఆదివారం జాతీయ ఓటర్‌ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో మై ఇండి యా.. మై ఓట్‌ అనే థీమ్‌తో వేడుకలు నిర్వహించారు. ఉత్తమ సేవలు అందించిన కలెక్టర్లు, ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌(ఈఆర్‌వో)లకు అవా ర్డులు అందజేశారు. గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ చేతుల మీదుగా గరిమ అగ్ర వాల్‌ బెస్ట్‌ ఎలక్టోరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డును స్వీకరించారు. గతంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక శాసనసభ నియోజకవర్గానికి ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ గా పనిచేసిన సమయంలో, ఓటర్ల నమోదు, ఓటరు అవగాహన కార్యక్ర మాలు, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణలో విశేష కృషి చేసినందుకు అవార్డుకు ఎంపికయ్యారు. అవార్డు అందుకున్న ఇన్‌చార్జి కలెక్టర్‌కు జిల్లా అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jan 26 , 2026 | 12:27 AM