జిల్లా కాంగ్రెస్ నాయకులతో రాష్ట్ర ఇన్‌చార్జి సమీక్ష
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:31 AM
హైదరాబాద్ గాంధీభవన్‌లో పొలిటికల్ అపైర్స్ కమిటీ(పీఏసీ)సమీక్ష సమావేశాన్ని ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి సచిన్ సావంత్ నిర్వహించారు.
సిరిసిల్ల టౌన్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్ గాంధీభవన్‌లో పొలిటికల్ అపైర్స్ కమిటీ(పీఏసీ)సమీక్ష సమావేశాన్ని ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర ఇన్‌చార్జి సచిన్ సావంత్ నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ అధ్యక్షతన జిల్లా పొలిటికల్ అపైర్స్ కమిటీ సమావేశం జరిగిం ది. రాష్ట్ర ఇన్‌చార్జి సచిన్ సావంత్ గత పీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ముందుగా జిల్లాకాంగ్రెస్ నాయకులతో సమీక్షించారు. అనం తరం జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వంపై ప్రజల అభిప్రా యాలు, సర్ కార్యచరణ ప్రణాళికలు, మండల, పట్టణ కమిటీల నిర్వహ ణ, బీఎల్‌ఏ-2 కార్యకలాపాల పర్యవేక్షణలపై చర్చించారు. అదే విధంగా జిల్లాలోని మిడ్ మానేరు ముంపు గ్రామాల సమస్యల పరిష్కారం, స్థానిక సమస్యలపై సమీక్షించారు. అనంతరం భవిష్యత్తు కార్యచరణపై దిశా నిర్ధే శంచేశారు. సమావేశంలో రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేన్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు కూస రవీందర్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు గుగు లోతుహరిలాల్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పండుగ ప్రదీప్, జిల్లా మైనా ర్టీ సెల్ అధ్యక్షుడు రియాజ్, సిరిసిల్ల మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ ఆడెపు చంద్ర కళ, యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కోలగాని వెంకటేశ్ పాల్గొన్నారు.